Islamic State of Iraq and Syria
-
‘ఉగ్ర’ భావజాల వ్యాప్తికి ఐఎస్ఐఎస్ స్కూళ్లు
సాక్షి, హైదరాబాద్: పిల్లలకు ఉగ్రవాద భావాలను నూరిపోసేందుకు ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ముష్కర సంబంధ పాఠశాలలను నడుపుతోందని సింగపూర్‌లోని కెపాసిటీ బిల్డింగ్ ఇంటర్నేషనల్ ఫర్ పొలిటికల్ వయొలెన్స్ అండ్ టైజమ్ రీసెర్చ్ మేనేజర్ డాక్టర్ జొలెనె జెరార్డ్ అన్నారు. రాజేంద్రనగర్‌లోని శివరామ్ పల్లి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీసు అకాడమీలో బుధవారం జరిగిన ‘చట్టాల అమలులో మహిళలు’ రెండోరోజు సదస్సులో ‘ఐఎస్ఐఎస్, టైస్ట్ త్రెట్స్ అండ్ ట్రెండ్స్’అనే అంశంపై ఆమె ప్రజెంటేషన్ ఇచ్చారు. సిరియాలో ఘర్షణలు, ఇరాక్‌లో అరాచకాలు, పాకిస్తాన్, అప్ఘానిస్థాన్‌ల్లో అభద్రతభావాల వల్లే టైజమ్ పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘అల్‌కాయిదా నుంచే ఐఎస్ఐఎస్ పుట్టింది. దీని కార్యకలాపాలు 65 దేశాల వరకు విస్తరించాయి. జైళ్ల వ్యవస్థలోని బలహీనతలు, న్యాయ రంగంలోని లొసుగులను అది అనుకూలంగా మలచుకుంటోంది. టైజం భావాలను పాదుకొల్పేలా సంబంధిత ప్రతులను ఆన్లైన్లో ఉంచుతోంది. ఇరాక్‌లో అమెరికా సైన్యాల అరాచకాలు, ఉరిశిక్ష తీయడం, ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టే లాంటి క్లిప్పింగ్‌లను పంపిస్తోంది. యువకులతో పాటు అమ్మాయిలను కూడా వలలో వేసుకునే ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది. ప్రాంతీయతత్వం అని, సోదరభావం అని, ప్రేమ అని, వీలుకాకపోతే పెళ్లి చేసుకుంటామని చెబుతూ వలలో వేసుకుంటున్నారు’ అని ఇరాక్, అఫ్ఘానిస్థాన్‌లో పర్యటించిన జెరార్డ్ తెలిపారు. హోంగ్రోన్ టైస్టులు, స్లీపర్ సెల్స్ రూపంలో ప్రధానంగా ముప్పు పొంచి ఉందన్నారు. వీట న్నింటినీ ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ స్థాయిలో సమన్వయం అవసరమన్నారు. ఇరాక్, అఫ్ఘాన్‌తో పాటు వివిధ దేశాల్లో జైల్లో మగ్గుతున్న ఉగ్రవాద ఖైదీలను కలిసి ఐసీఎస్ కార్యకలాపాల గురించి తెలుసుకున్నానన్నారు. మహిళలు నాయకత్వ సవాళ్లను స్వీకరించాలి... ‘మహిళలు ఏ రంగంలోనైనా నాయకత్వ సవాళ్లను స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలి. దీనికి లింగభేదం లేనప్పటికీ, ఉన్నత స్థానాల్లో ఎంపిక చేసేటప్పుడు మహిళలను పరిగణనలోకి తీసుకోని సందర్భాలుం టాయి. ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం లాంటి లక్షణాలు మహిళల్ని తప్పకుండా ఉన్నతస్థానాలకు చేరుస్తాయ’ని హెచ్ఆర్డీ చీఫ్ టాలెంట్ ఆఫీసర్ ప్రొఫెసర్ డాక్టర్ సుజయ బెనర్జీ అన్నారు. ‘పట్టాలు తప్పుతున్న నాయకత్వం-నాయకుల్లో వైఫల్యాలు ఎందుకు’ అన్న అంశంపై ఆమె ప్రజెంటేషన్ ఇచ్చారు. ‘నాయకత్వం-భావోద్వేగ తెలివి’ అన్న అంశంపై అహ్మదాబా ద్ ఐఎంఎం ప్రొఫెసర్ డాక్టర్ నిహారిక వోహ్రా మాట్లాడుతూ సానుకూల, వ్యతిరేక భావోద్వేగాలు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయో...వాటిని ఎలా నియంత్రించవచ్చో తెలిపారు. ‘నేను చేయగలను. నేను చేస్తాను. అన్నప్పుడే పోలీసు రంగంలో మహిళలు ఉన్నతస్థానాలకు చేరుకోగలుగుతార’ని ఎన్పీఏ డెరైక్టర్ అరుణా బహుగుణ అన్నారు. -
ఏం జరుగుతుందో... భయం భయం
నగర వాసుల కిడ్నాప్‌తో మళ్లీ తెరపైకి ఐఎస్ఐఎస్ సిటీబ్యూరో: ఉగ్రవాద చర్యలతో ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) పేరు మరోసారి నగరంలో చర్చనీయాంశమైంది. ఆ ఉగ్రవాద సంస్థకు పట్టున్న లిబియాలోని సిర్టియో ప్రాంతంలో హైదరాబాద్‌కు చెందిన చిలువేరు బలరామ్ కిషన్, గోపీ కృష్ణతో పాటు మరో ఇద్దరు కిడ్నాప్‌నకు గురవడంతో ఇది ఐఎస్ఐఎస్ పనేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కిడ్నాపర్ల చెర నుంచి వారు క్షేమంగా విడుదలయ్యారన్న సమాచారం లేకపోవడంతో... నగరవాసులు ఆందోళనకు గురయ్యారు. ఇదిలా ఉండగా ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు సామాజిక మాధ్యమాల్లో చాటింగ్‌తో సిటీ యువతను ఆకర్షిస్తున్నారు. జీహాద్ (పవిత్ర యుద్ధం) పేరిట తమ సంస్థల్లో సభ్యులుగా చేర్చుకునేందుకు పన్నిన పన్నాగాలను పోలీసులు ఎప్పటికప్పుడు చిత్తు చేస్తూనే ఉన్నారు. అయినా వారి ప్రయత్నాలు విరమించుకోవడం లేదు. తాజాగా కిడ్నాప్ ఉదంతంతో నగరవాసులు ఉలిక్కిపడ్డారు. సిటీ యువతపై కన్ను... ఐఎస్ఐఎస్ వైపు మొగ్గు చూపుతున్న వారిలో ఇంజినీరింగ్, మెడిసిన్ అభ్యసించే విద్యార్థులతో పాటు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు సైతం ఉంటున్నారు. ఫేస్బుక్ ద్వారా ముందు చాటింగ్‌లోకి దింపుతారు. యువకుల మనోభావాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత, నెమ్మదిగా వారిని రెచ్చగొడుతూ ఉగ్రవాదం వైపు ఆకర్షితులయ్యేలా చేస్తున్నారు. హుమయూన్‌నగర్‌కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి ఒకరు గత ఏడాది ‘పవిత్ర యుద్ధం కోసం ఇరాక్ వెళ్తున్నాను. నా కోసం వెతకొద్దు. అదృష్టం ఉంటే స్వర్గంలో కలుసుకుంటా’నని తన తండ్రికి లేఖ రాసి వెళ్లిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో బంగ్లాదేశ్‌లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న ఆ యువకుడిని కొద్ది రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు. అతడితో పాటు కరీంనగర్‌కు చెందిన మరో ఇంజినీరింగ్ విద్యార్థి, చాంద్రాయణ గుట్టకు చెందిన ఇంజినీరింగ్, మెడికల్ విద్యార్థులు కూడా ఉన్నారు. ఇలా ఆరునెలల కాలంలోనే ఐఎస్ఐఎస్లో చేరాలనుకున్న వారి సంఖ్య 84 వరకు ఉన్నట్లు సమాచారం. వీరిని నగర పోలీసులు విచారించగా విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. వెంటనే వారి తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ చేశారు. వీరిలో కొందరిని ముందుజాగ్రత్త చర్యగా మెజిస్ట్రేట్ ముందు బైండోవర్ చేశారు. ఇటువంటి ఘటనలపై ఇప్పటికే సిటీ పోలీసులు నిఘా వేసి ఉంచారు. ఏ మాత్రం అనుమానం వచ్చినా పిలిపించి కౌన్సెలింగ్ చేస్తున్నారు. -
జైల్లో నుంచి తప్పించుకుంటా!
ఢిల్లీలోని భార్యతో ఫోన్లో ఐఎం ఉగ్రవాది యాసిన్ భత్కల్ బయటపడ్డాక సిరియా రాజధాని డమాస్కస్ పారిపోదాం ఫోన్ సంభాషణల ఆధారంగా గుర్తించిన కేంద్ర నిఘా వర్గాలు భద్రత రెట్టింపునకు ప్రభుత్వం ఆదేశాలు హైదరాబాద్: ప్రపంచ దేశాలకు సవాల్ విసురుతున్న ఐఎస్ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా) ఉగ్రవాద సంస్థ దేశంలో మారణహోమం సృష్టించడంతోపాటు జైళ్లలోని ఉగ్రవాదులను ఎలాగైనా తప్పించేందుకు కుట్రపన్నుతున్నట్లు కేంద్ర నిఘా వర్గాలు పసిగట్టాయి. దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు, ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ను హైదరాబాద్‌లోని చర్లపల్లి జైలు నుంచి తప్పించేందుకు వ్యూహరచన చేస్తున్నట్లు యాసిన్ ఇటీవల తన భార్య జెహిదాతో మాట్లాడిన ఫోన్ సంభాషణల ఆధారంగా గుర్తించాయి. సిరియా రాజధాని డమాస్కస్‌లోని స్నేహితులు త్వరలో తనను జైలు నుంచి తప్పిస్తారని...అవసరమైతే జైలు గోడలు బద్దలు కొట్టైనా బయటకు తెస్తారని అతను చెప్పినట్లు తెలుస్తోంది. అనంతరం డమాస్కస్ పారిపోదామని భార్యతో పేర్కొన్నట్లు తెలియవచ్చింది. అప్రమత్తమైన నిఘా వర్గాలు... దేశంలో దాదాపు 40 బాంబు పేలుళ్ల కేసుల్లో నిందితుడైన యాసిన్ భత్కల్ తన భార్యతో జరిపిన ఫోన్ సంభాషణల నేపథ్యంలో కేంద్ర నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. జైళ్లలోని ఉగ్రవాదులపై నిఘా పెంచాలని, భద్రతను రెట్టింపు చేయాలని, ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా పరిశీలించాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించాయి. మరోవైపు యాసిన్ భత్కల్‌కు న్యాయస్థానం ఆదేశాల మేరకు ఫిబ్రవరి 18 నుంచి కుటుంబ సభ్యులతో ల్యాండ్‌లైన్ ఫోన్లో మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు జైళ్లశాఖ డీఐజీ నర్సింహ తెలిపారు. భత్కల్ ఇప్పటివరకు 27 సార్లు ఫోన్లో మాట్లాడాడని, అరబిక్, ఉర్దూలలో సాగిన అతని సంభాషణలను ప్రత్యేక నిపుణుల కమిటీ విశ్లేషిస్తున్నట్లు శనివారం విలేకరుల సమావేశంలో ఆయన చెప్పారు. భత్కల్‌కు అందరి ఖైదీల మాదిరిగానే వారానికి రెండుసార్లు ఫోన్ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. భత్కల్ తన భార్య జెహిదా, తల్లి రెహానాలతో మాట్లాడేందుకు అనుమతి కోరగా తాము ఆయా ఫోన్ నంబర్లను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలతో సంప్రదించి వారి ఆదేశాల మేరకే అనుమతించామన్నారు. జైల్లో కేవలం ఎస్టీడీ ఫోన్ సౌకర్యమే ఉంటుందని, ఐఎస్డీకి అవకాశం లేదని డీఐజీ స్పష్టం చేశారు. చర్లపల్లి కేంద్రకారాగారంలో మొత్తం 13 మంది ఉగ్రవాదులున్నారన్నారు. 2013 సెప్టెంబర్ 24 నుంచి భత్కల్ చర్లపల్లి జైల్లో ఉంటున్నాడని, మధ్యలో ఒకట్రెండుసార్లు అతన్ని వివిధ కేసులరీత్యా ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలించామన్నారు. గతేడాది నవంబర్ 16 నుంచి అతన్ని పూర్తి స్థాయిలో చర్లపల్లి జైల్లోనే ఉంచామన్నారు. -
మంచిర్యాలపై ‘ఉగ్ర’ నీడ..!
- ఐఎస్ఐఎస్ వలలో స్థానిక యువకుడు..? - ఉగ్రవాద కార్యకలాపాల్లో పాలుపంచుకుంటూ మృతి..? - అతనితో పాటే కరీంనగర్ జిల్లా వాసి - ఆరా తీస్తోన్న నిఘా వర్గాలు సాక్షి, మంచిర్యాల: నిషేదిత ఉగ్రవాద సంస్థ.. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) నీడ ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలపైనా పడింది. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన యువకులు ఆకర్శితులయ్యేలా గాలం వేస్తోన్న ఆ సంస్థ ఉగ్రవాదులు మంచిర్యాలకు చెందిన ఓ యువకుడినీ తమ సంస్థలో చేర్పించుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. మంచిర్యాల పట్టణానికి చెందిన ఒకరి కుమారుడు ఉన్నత చదువుల కోసం గతేడాది అమెరికా వెళ్లాడు. కొన్ని నెలలు చదువుపై దృష్టి పెట్టిన సదరు యువకుడు ఆ తర్వాత నిషేదిత సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్)కు ఆకర్శితుడై అందులో చేరాడు. తాను ఐఎస్ఐఎస్లో చేరిన విషయాన్ని గతంలో ఓసారి తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పినట్లు తెలిసింది. అటు విషయం తె లుసుకున్న నిఘా వర్గాలూ యువకుడి కుటుంబీకులు, బంధువులను హైదరాబాద్‌కు పిలిపించి రహాస్యంగా విచారించినట్లు సమాచారం. ఫోన్ చేసినప్పుడు ఏం మాట్లాడారు..? అతను ఐఎస్ఐఎస్లో చేరడంలో ఎవరి ప్రమేయం ఉందీ..? అనే విషయాలతో పాటు అక్కడ ఆ యువకుడి స్నేహితుల గురించి ఆరా తీసినట్లు సమాచారం. అయితే, సదరు యువకుడు ‘ఉగ్ర’ కార్యకలాపాల్లో పాలు పంచుకుంటూ విదేశాల్లోనే ఇటీవల మరణించినట్లు ప్రాథమికంగా తెలిసింది. అయితే.. అతను ఎలా మరణించాడు..? అంత్యక్రియలు ఎక్కడ జరిగాయనేదీ మాత్రం ఎవరికీ తెలియదు. మరోపక్క.. కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన మరో యువకుడూ ఇతనితో పాటే నిషేదిత ఉగ్ర సంస్థలో చేరినట్లు విశ్వసనీయ సమాచారం. -
సోషల్ మీడియాపై డేగ కన్ను
శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యాఖ్యల గుర్తింపే లక్ష్యం ఇందు కోసం ప్రత్యేక ల్యాబ్ ఏర్పాటు సుమోటోగా కేసుల నమోదు, దర్యాప్తునకు అవకాశం ఇలాంటి వ్యవస్థ దేశంలో ఇది రెండోది మాత్రమే అప్రమత్తమైన పోలీసులు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు, సానుభూతి పరుల బెదిరింపుల నేపథ్యంలో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలో విధానసౌధ, వికాససౌధ వంటి ప్రముఖ కట్టడాల వద్ద, చారిత్రాత్మక ప్రాంతాలతో పాటు మాల్స్ వద్ద నిఘా పెంచారు. అనుమానం ఉన్న ప్రతి వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తున్నారు. మరోవైపు బెదిరింపు నేపథ్యంలో మహ్దీ మద్దతుదారులను గుర్తించడానికి పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. బెంగళూరు: ‘మెహ్దీ’ ఉదంతంతో నగర పోలీసులు మేలుకున్నారు. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) సంస్థకు మద్దతుగా ట్విట్టర్ (సామాజిక సంబంధాల వేదిక-సోషియల్ మీడియా) ద్వారా బెంగళూరులో ఉన్న మెహ్దీ మస్రూర్ బిశ్వాస్ పనిచేస్తున్న విషయాన్ని ఎక్కడో ఉన్న బ్రిటన్‌కు చెందిన ఛానల్ 4 సంస్థ ప్రసారం చేసేంతవరకూ మనవాళ్లు పసిగట్టలేక పోయారు. ఈ విషయం అటు జాతీయ స్థాయిలోనే కాక అంతర్జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశమైంది. సమాచార సాంకేతిక రాజధానిగా పేరొందిన బెంగళూరులో ఐటీపరిజ్ఞానాన్ని వినియోగించుకుని శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పనులు చేపడుతున్న ఓ వ్యక్తి గురించి తెలుసుకోలేకపోవడం సరికాదని కేంద్ర నిఘా వర్గాలు రాష్ట్ర పోలీసులకు తలంటాయి. దీంతో మేలుకున్న రాష్ట్ర హోం శాఖ ముఖ్యంగా నగర పోలీసులు మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడంలో తలములకలయ్యారు. మానిటరింగ్ ల్యాబ్... సోషియల్ మీడియా ద్వారా ఎవరు, ఎప్పుడు, ఎక్కడ నుంచి సమాచారాన్ని రవాణా చేస్తున్నారన్న విషయం గమనించడం చాలా కష్టమైన పని. అంతే కాక సోషియల్ మీడియాలో వచ్చిన ప్రతి సమాచారాన్ని విశ్లేషించడం కూడా కుదరదు. అయితే ప్రత్యేక విధానం ద్వారా ఫేస్బుక్, ట్విట్టర్ తదితర సోషియల్ మీడియాల్లో నిర్థిష్ట విషయం అప్లోడ్ అయిన వెంటనే కనుగొనడానికి కొన్ని ప్రత్యేక విధానాలు ఉన్నాయి. ఇందుకు అనుగుణంగా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను కూడా పోలీసులు సమకూర్చుకుంటున్నారు. ఇందు కోసం ‘సోషియల్ మీడియా మానిటరింగ్ ల్యాబ్’ను రహస్య స్థలంలో ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా హాకింగ్ నుంచి తప్పించుకోవడానికి వీలవుతుందని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు ఇప్పటి వరకూ ఉన్న నిబంధనలను అనుసరించి సోషియల్ మీడియాలోని సమాచారంపై ఫిర్యాదు చేసిన సమయంలోనే, చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది. అయితే మానిటరింగ్ ల్యాబ్ ఉండటం వల్ల సుమోటోగా కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేయడానికి అవకాశం కలుగుతుంది. ఇప్పటి వరకూ ఇలాంటి ఏర్పాటు ముంబైలో మాత్రమే ఉంది. ‘మెహ్దీ’ ఘటన నేపథ్యంలో పోలీసులు ముంబై వెళ్లి అక్కడి విధివిధానాలను పరిశీలించి మానిటరింగ్ ల్యాబ్‌ను కర్ణాటకలో కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయం పై నగర కమిషనర్ ఎం.ఎన్ రెడ్డి మాట్లాడుతూ... ‘ఉగ్రవాదం కొత్తపోకడలను అనుసరిస్తోంది. అందుకు అనుగుణంగా మేము కూడా మా నిఘా, దర్యాప్తు విధానాలను మార్చుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగా ఒక ప్రత్యేక ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నాం’ పేర్కొన్నారు. -
ఐఎస్ మద్దతుదారుడి అరెస్ట్
‘ట్వీటర్ ఖాతా’ మెహ్దీని పట్టుకున్న పోలీసులు ఐటీసీ ఫుడ్స్‌లో ఏటా 5.3 లక్షల వేతనంతో ఉద్యోగం చేస్తున్న మెహ్దీ సాక్షి, బెంగళూరు: ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు వినియోగించే ట్వీటర్ ఖాతాను నిర్వహిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరుకు చెందిన మెహ్దీ మస్రూర్ బిస్వాస్(24) గత కొన్నేళ్లుగా ఈ ఖాతాను నిర్వహిస్తున్నట్లు తేలింది. ఇంజనీరింగ్ పూర్తిచేసిన ఇతడు ఐటీసీ ఫుడ్స్ సంస్థలో ఏటా రూ.5.3 లక్షల వేతన ప్యాకేజీతో ఎగ్జిక్యూటివ్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. బెంగళూరులో అద్దె నివాసం నుంచి అతడిని అరెస్టు చేసినట్లు కర్ణాటక డీజీపీ లాల్‌రుకుం పచావో శనివారమిక్కడ విలేకరులకు వెల్లడించారు. ఐఎస్ఐఎస్ ఖాతాను తానే నిర్వహిస్తున్నట్లు మెహ్దీ అంగీకరించాడని తెలిపారు. ఐఎస్ ఉగ్రవాదుల ట్వీటర్ ఖాతాను ‘షామీ విట్నెస్’ పేరుతో బెంగళూరుకు చెందిన మెహ్దీ నిర్వహిస్తున్నాడని, బ్రిటన్‌కు చెందిన చానల్ ‘4 న్యూస్’ బయటపెట్టిన సంగతి తెలిసిందే. అరెస్టు చేస్టున్న సమయంలో మెహ్దీ నుంచి ఎలాంటి ప్రతిఘటన లేదని బెంగళూరు పోలీసు కమిషనర్ ఎంఎన్ రెడ్డి తెలిపారు. ‘బిశ్వాస్‌పై ఐపీసీ సెక్షన్ 125 (వ్యక్తిగతంగాగానీ సమూహంగాగానీ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించడం లేదా అందుకు యత్నించడం), సెక్షన్ 18, సెక్షన్ 39లతోపాటు ఐటీ చట్టంలోని సెక్షన్ 66 కింద కేసులు నమోదు చేశాం. అతడి నుంచి రెండు ఫోన్లు, ఒక ల్యాప్‌ట్యాప్‌ను స్వాధీనం చేసుకున్నాం’’ అని తెలిపారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నామని, మన దేశం వరకైతే ఎలాంటి ఉగ్రవాద కార్యకలాపాల్లో అతడి ప్రమేయం లేదని అన్నారు. ఐఎస్ ఉగ్రవాద సంస్థలో బిశ్వాస్ ఇప్పటివరకు ఎవరినీ చేర్చలేదని. విదేశాలకు కూడా ఎప్పుడూ వెళ్లలేదని అన్నారు. పగలు ఉద్యోగం.. రాత్రి ఇంటర్నెట్లో.. బిశ్వాస్ పగలంతా ఉద్యోగం చేస్తూ రాత్రి వేళలో ఇంటర్నెట్ ముందు గడిపేవాడని డీజీపీ పచవ్ తెలిపారు. ఐఎస్ఐఎస్/ఐఎస్ఎల్ వెబ్సైట్లలో బ్రేకింగ్ న్యూస్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు 60 జీబీ డేటా సామర్థ్యంగల ఇంటర్నెట్ కనెక్షన్‌ను వాడుతున్నాడని వివరించారు. బిశ్వాస్కు ఇద్దరు అక్కలు ఉన్నారని, ఇతడి తండ్రి పశ్చిమబెంగాల్ విద్యుత్ బోర్డులో పనిచేసి రిటైర్డ్ అయ్యారని వివరించారు. నమ్మను: బిశ్వాస్ తండ్రి కోల్‌కతా: బిశ్వాస్కు ఐఎస్‌తో సంబంధాలున్నాయని నమ్మడం లేదని ఆయన తండ్రి శ్వాస్ చెప్పారు. కుమారుడి ఇంటర్నెట్ అకౌంట్‌ను ఎవరైనా హ్యాక్ చేసి ఉండొచ్చని అన్నారు. ‘‘ఈ విషయం తెలియగానే శుక్రవారం ఫోన్ చేసి అడిగాను. ఇదంతా ఎలా జరిగిందో అర్థం కావడం లేదని చెప్పాడు’ అని తెలిపారు. -
నగరంలో ‘ఐఎస్ఐఎస్’ జాడలు
ఇరాక్ వెళ్లేందుకు సిద్ధమైన 42 మంది మతగురువు సమాచారంతో వెలుగులోకి కౌన్సెలింగ్ చేసి నిఘా పెంచిన పోలీసులు హైదరాబాద్: హైదరాబాద్‌లో ఉగ్రవాద జాడలు విస్తరిస్తున్నాయి.. నిన్నటి వరకు ఐ.ఎస్.ఐ., అల్‌కాయిదా సంస్థల మాటే వినిపించగా... ఇప్పుడు కొత్తగా ఐఎస్ఐఎస్(ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా) పేరు వినిపిస్తోంది. సోషల్‌మీడియా ద్వారా నగరంలోని ‘సాఫ్ట్’యువతను ఉగ్రవాదంపై మళ్లించేందుకు ఉగ్రసంస్థలన్నీ ప్రయత్నిస్తున్నాయి. ఓ మతగురువు సమాచారంతో తాజాగా ఈ విషయం వెలుగు చూసింది. నగరంలోని హుమాయూన్‌నగర్‌లోని ఓ మతగురువు కుమారుడు (25) నాలుగు నెలల కిందట ఇంట్లో నుంచి పారిపోయాడు. వెళ్లేముందు ‘‘నేను జిహాద్ (పవిత్ర యుద్ధం) కోసం వెళుతున్నాను. నా కోసం వెతకొద్దు’’ అని లేఖరాసి పెట్టాడు. ఈ విషయాన్ని మతగురువు ఓ ఐపీఎస్ అధికారికి తెలపడంతో అప్రమత్తమైన పోలీసులు యువకుడి ని పట్టుకొని విచారించారు. విచారణలో దిమ్మతిరిగే నిజాలు... యువకుడి విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. సోషల్‌మీడియా ద్వారా తాము ఉగ్రవాదం వైపు ఆకర్షితులమయ్యామని, తనలా జిహాద్ కోసం ఇరాక్ వెళ్లేందుకు 42 మంది సిద్ధమయ్యారని పోలీసులకు తెలిపాడు. ఇరాక్ వెళ్లేందుకు తమ బ్యాంకు అకౌంట్ లో గుర్తు తెలియని వ్యక్తులు డబ్బులు కూడా జమ చేశారని చెప్పాడు. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు.. రెండు నెలల కిందట బంగ్లాదేశ్ సరిహద్దులు దాటేందుకు యత్నించి పట్టుబడిన నలుగురితోపాటు యువకుడు చెప్పిన అందరినీ తీసుకొచ్చి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు. వైద్యవిద్యార్థిని... సాఫ్ట్వేర్ ఇంజనీర్.. ఐఎస్ఐఎస్ సంస్థ వైపు ఆకర్షితులైన వారిలో ఒక వైద్యవిద్యార్థిని కూడా ఉంది. నగరశివార్లలోని ఓ ప్రైవేటు వైద్యకళాశాలలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని (20) ఫేస్బుక్ ద్వారా జిహాద్ వైపు ఆకర్షితురాలైంది. తాను ఐఎస్ఐఎస్లో చేరతానని తల్లికి కూడా చెప్పింది. వీరిరువురికీ పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి వదిలిపెట్టారు. అలాగే, ఐఎస్ఐఎస్ సంస్థలో చేరేందుకు సిద్ధమైన ముషీరాబాద్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మునావద్ సల్మాన్ (30)ను మెజిస్ట్రేట్ ముందు బైండోవర్ చేశారు. అప్రమత్తతతో ఉన్నాం: ఉగ్రవాదం వైపు ఆకర్షితులయ్యేవారిని కౌన్సెలింగ్ చేస్తున్నాం. ఇప్పటివరకు ఇలాంటి వారిపై ఎలాంటి కేసులు నమోదు కాలేదు. అందుకే వారిని బైండోవర్ చేసి నిరంతరం నిఘా పెంచుతాం. సోషల్ మీడియాపై కూడా దృష్టి సారించాం. - మహేందర్‌రెడ్డి, నగర పోలీస్ కమిషనర్.