ఆధునిక పద్ధతులతో అధిక దిగుబడులు
హిందూపురం రూరల్ : పట్టు రైతులు ఆధునిక పద్ధతులను అవలంభించి అధిక దిగుబడులు సాధించాలని కేంద్ర పట్టు బోర్డు మండలి చైర్మన్ హనుమంతరాయప్ప అన్నారు. ఆదివారం గుడ్డంలోని బైవోల్టిన్ విత్తన ఉత్పత్తి కేంద్రంలో పట్టు రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు బైవోల్టిన్ పట్టు పురుగుల పెంపకంతో అధిక ఆదాయం పొందవచ్చన్నారు. అందుకు అవసరమైన ఆధునిక పద్ధతులను అవలంభించాలన్నారు. దేశంలో పట్టు పురుగ పెంపకం ద్వారా తక్కువ దిగుబడి రావడంతో చైనా, కొరియా దేశాల నుంచి ముడిపట్టును దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన చెందారు.
ప్రభుత్వం అందించే సబ్సిడీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆటోమెటిక్ రీలింగ్ మిషన్‌కు పూర్తి ధర రూ.1.30 కోట్లు ఉండగా అందులో రూ.65 లక్షల సబ్సిడీ అందిస్తామన్నారు. జేడీ అరుణకుమారి, విశ్రాంత జేడీ సత్యనారాయణరాజు, సెంట్రల్ సెరికల్చర్ బోర్డు శాస్త్రవేత్తలు రాఘువేంద్రరావు, శ్రీనివాసులు, డాక్టర్ మూర్తి, శాస్త్రవేత్త మనోహర్‌రెడ్డి, విద్దున్‌మాల, శాంతన్‌బాబు, బాలాజి చౌదరి, డీడీ సదాశివరెడ్డి, ఏడీ నాగరంగయ్య, పట్టురైతులు పాల్గొన్నారు.