ఎర్రగుంట్ల: ఎర్రగుంట్ల– కమలాపురం మార్గంలో ఆర్టీసీ బస్సులో వెళుతున్న ఏడుగురు తమిళ కూలీలను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ ఆర్‌ఐ అలీబాషా, ఎఫ్‌ఆర్‌వో రమణారెడ్డి తెలిపారు. శనివారం ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్‌లో ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు. తమిళ కూలీల ఆచూకీ కోసం తిరుపతి టాస్క్‌ఫోర్స్ ఆర్‌ఎస్‌ఐ ప్రసాద్, హెడ్ కానిస్టేబుల్ నర్సింహ, కానిస్టేబుళ్లు హుస్సేన్, నర్సింహలు ఆర్టీసీ బస్సులో వస్తుండగా బస్సులో అనుమానాస్పదంగా కనిపించిన ఏడుగురు తమిళ కూలీలను అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. పూర్తి సమాచారం కోసం వారిని విచారిస్తున్నామని పేర్కొన్నారు.