Erraguntla
-
Watch Live: నంద్యాల జిల్లా ఎర్రగుంట్లలో సీఎం జగన్ తో ముఖాముఖి
-
77 వేల మందికి ఒక్కటే ఆధార్ కేంద్రం!
ఎర్రగుంట్ల: ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు ఆధార్ తప్పనిసరి కావడంతో ఆధార్‌లో మార్పులు, చేర్పులు చేసుకునేందుకు జనం త్వరపడుతున్నారు. ప్రజలు భారీ సంఖ్యలో తరలి వస్తుండగా వారికి సరిపోయే సంఖ్యలో ఆధార్ కేంద్రాలు లేకపోవడంతో గంటల తరబడి క్యూలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల మండలం, ఎర్రగుంట్ల మున్సిపాల్టీ పరిధిలో 77 వేల మందికి పైగా జనాభా ఉన్నారు. వీరందరికీ ఎర్రగుంట్లలోని ముద్దనూరు రోడ్డు ఎస్బీఐలో ఉన్న ఆధార్ కేంద్రం మాత్రమే ఆధారం. పిల్లలకు కొత్తగా ఆధార్ కార్డు కావాలన్నా, మార్పు చేర్పులు చేసుకోవాలన్నా ఇదొక్కటే దిక్కు. దీంతో కొద్దిరోజులుగా జనం రాత్రీ పగలనక ఇక్కడ నిరీక్షిస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున 4 గంటల నుంచి ఆధార్ టోకెన్ల కోసం భారీగా క్యూ కట్టారు. జోరున వర్షం పడుతున్నా లెక్కచేయకుండా టోకెన్లు తీసుకునేందుకు గొడుగులు పట్టుకొని మరీ బారులు తీరారు. 500 మందికి పైగా అక్కడ నిరీక్షిస్తూ కనిపించారు. ఉదయం పది గంటల తరువాత జనం మరింత పెరిగారు.దీంతో కొద్దిపాటి తోపులాట జరిగింది. రద్దీని నియంత్రించేందుకు సీఐ సదాశివయ్య నలుగురు కానిస్టేబుల్స్‌ను పంపించారు. అయినా చాలా మంది మహిళలు, పిల్లలు తోపులాటలో ఇబ్బందులు పడ్డారు. పాఠశాలలకు సెలవు పెట్టి మరీ పిల్లలు టోకెన్ల కోసం క్యూలో నిలబడ్డారు. టోకెన్లు ఇవ్వడం ప్రారంభించాక మరింత తోపులాట జరిగింది. జనాన్ని నియంత్రించేందుకు పోలీసులు నానా ఇబ్బందులు పడ్డారు. బ్యాంక్ సిబ్బంది సైతం లోనికి వెళ్లలేక బయటే నిలబడిపోయారు. గర్భవతులు, బాలింతలు ఈ తోపులాటలో ఇబ్బందులు పడ్డారు. -
డబ్బులు చెల్లించమన్నందుకు దాడి
సాక్షి, ఎర్రగుంట్ల(కడప) : పొదుపు సంఘానికి చెందిన బకాయి డబ్బులు చెల్లించాలని అడిగినందుకు డ్వాక్రా సంఘాల సీసీ ఇబ్రహీం, హెడ్‌డీసీసీ రామ్మోహన్‌లపై పొదుపు సంఘం లీడర్ వరలక్ష్మితో పాటు ఆమె బంధువులు దాడి చేసి గాయపరిచారని వెలుగు అసిస్టెంట్ ప్రోగ్రాం అధికారి (ఏపీఎం) అపర్ణ దేవి స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఏఎస్ఐ శ్రీనివాసులు కథనం మేరకు... మండల పరిధిలోని చిలంకూరు గ్రామంలో సాయిచందన గ్రూపు పొదుపు సంఘం లీడర్ డి. వరలక్ష్మి తన అవసరాల నిమిత్తం రూ.2.70 లక్షలు అప్పుగా తీసుకుంది. ఆ అప్పును చెల్లించకపోవడంతో ఆ గ్రూపులోని సభ్యులందరూ బకాయి డబ్బులు చెల్లించాలని ఆమెపై ఒత్తిడి తెచ్చారు. దీంతో చిలంకూరు పొదుపు సంఘాలకు చెందిన కమ్యూనిటీ కో ఆర్డినేటర్ ఇబ్రహీం, హ్యూమన్ డెవలప్మెంట్ కమ్యూనిటీ కో ఆర్డినేటర్ రామ్మోహన్‌లు డబ్బులు చెల్లించాలని ఆమెను అడిగారు. ఆగ్రహించిన వరలక్ష్మి, ఆమె కుటుంబ సభ్యులతో పాటు మరి కొందరు ఎర్రగుంట్లలోని వెలుగు కార్యాలయానికి వచ్చి విధి నిర్వహణలో ఉన్న సీసీ ఇబ్రహీం, హెచ్‌డీసీసీ రామ్మోహన్‌లపై కర్రలు, వాటర్‌పైపు, వైర్లతో దాడి చేసి గాయపరిచారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
రెండు లారీలు ఢీ.. స్కూటరిస్టు మృతి
వైఎస్సార్ జిల్లా : రెండు లారీలు ఢీకొన్న సంఘటనలో ఓ స్కూటరిస్టు మృతి చెందాడు. ఈ సంఘటన ఎర్రగుంట్ల మండలం తిప్పలూరు గ్రామం వద్ద చోటుచేసుకుంది. ఆర్మీలో పనిచేసి ప్రస్తుతం కడప ఎయిర్ పోర్ట్‌లో సెక్యూరిటీ అధికారిగా మురళీధర్ రెడ్డి(35) పనిచేస్తున్నారు. యర్రగుంట్లలోని తన అత్తమ్మ ఇంటికి బైక్‌పై బయలుదేరారు. తిప్పలూరు వద్ద వెనకవైపు నుంచి వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఎదురుగా వస్తున్న మరో లారీ ముందుపడిపోయాడు. అనంతరం రెండు లారీలు ఢీకొట్టడంతో, మధ్యలో పడిపోవడంతో మురళీధర్ రెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు. లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడు పీరాను 108లో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మురళీధర్ రెడ్డి స్వస్థలం పెద్దముడియం. -
వైఎస్సార్సీపీ ఏజెంట్‌పై కారెక్కించిన సీఎం రమేష్
సాక్షి, ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామంలోని ప్రభుత్వ ఎస్సీ వసతి గృహంలో ఉన్న 248 పోలింగ్ కేంద్రం వద్ద వైఎస్సార్సీపీ ఏజెంట్ పడిగపాటి వెంకట సుధాకర్‌రెడ్డిపై రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ దాడి చేసి, ఆ ఏజెంట్‌పై కారు ఎక్కించిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. ఈ సంఘటన చూసి ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లందరు భయభ్రాంతులయ్యారు. బాధితుడు, వైఎస్సార్సీపీ ఏజెంటు పడిగపాటి వెంకటసుధాకర్‌రెడ్డి ఎర్రగుంట్ల పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ఎంపీ రమేష్, అతని కారు డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎర్రగుంట్ల పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పోట్లదుర్తి గ్రామానికి చెందిన పడిగపాటి వెంకట సుధాకర్‌రెడ్డి గ్రామంలోని జెడ్పీ హైస్కూల్లోని 241 పోలింగ్ స్టేషన్లో వైఎస్సార్ సీపీ పార్లమెంట్ అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డి తరుపున ఏజెంటుగా కూర్చున్నాడు. గ్రామంలోని ఎస్సీ వసతి గృహంలో 248 పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ నేతలు ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని తెలిసి రిలీవర్ ఏజెంట్ గా ఉన్న వెంకట సుధాకర్‌రెడ్డి అక్కడికి వచ్చారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ అక్కడ ఉన్న మరో వ్యక్తితో నీవు ఎందుకు వచ్చావని ప్రశ్నించారు. అదే సమయంలో అక్కడే ఉన్న పడిగపాటి వెంకటసుధాకర్‌రెడ్డి మీరు కూడా ఏజెంట్ కాదు కదా ఎందుకు వచ్చారని ఎంపీ రమేష్‌తో అన్నారు. అంతే.. సీఎం రమేష్ ఆగ్రహించి వైఎస్సార్సీపీ ఏజెంట్ అయిన వెంకటసుధాకర్‌రెడ్డిపై చేయి చేసుకున్నాడు. దీంతో అవమానానికి గురైన వెంకటసుధాకర్‌రెడ్డి తనకు ఎంపీ రమేష్ క్షమాపణ చెప్పాలంటూ అతని కారుకు అడ్డంగా రోడ్డుపై భైఠాయించాడు. దీంతో ఆగ్రహించిన రమేష్ తన కారును సుధాకర్‌రెడ్డిపైకి ఎక్కించి వెళ్లిపోయాడు. ఈ ఘటనలో సుధాకర్‌రెడ్డి ఎడమ కాలు పాదం విరిగి వాపుడు గాయం అయింది. వెంటనే పోలీసులు సుధాకర్‌రెడ్డిని బలవంతంగా కారులో ఆçస్పత్రికి తరలించారు. ఈ మేరకు పడిగపాడి సుధాకర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎంపీ రమేష్‌తో పాటు, అతని కారు డ్రైవర్లపై సెక్షన్ 323, 324, ఆర్/డబ్లు్య 34 ఐపీసీ కింద కేసు నమోదు చేసినట్లు ఎర్రగుంట్ల పోలీసులు తెలిపారు. -
బీమా.. ఏదీ ధీమా?
సాక్షి, ఎర్రగుంట్ల : రెండేళ్లు గడిచినా భవన నిర్మాణ కార్మికులకు బీమా పరిహారం పూర్తి స్థాయిలో అందలేదు. బడ్జెట్లో నిధుల నిల్వ ఉన్నప్పటికీ టీడీపీ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు మొండిచేయి చూపిస్తోంది. భవన నిర్మాణ కార్మిక రంగానికి అధిక ప్రాధాన్యత, కార్మికుల కష్టాన్ని వమ్ము చేయమని చెబుతున్న టీడీపీ ప్రభుత్వం వారి బాగోగులను పట్టించుకోవటం లేదని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గంలో ఎర్రగుంట్ల, ముద్దనూరు, కొండాపురం, జమ్మలమడుగు, మైలవరం, పెద్దముడియం మండలాల్లో తాపీ, పెయింటర్లు, రాడ్ బిల్డింగ్, ఆగర్లు, కార్పెంటర్లతోపాటు 31 విభాగాలకు చెందిన భవన నిర్మాణ కార్మికులుగా గుర్తింపు పొందిన వారు సుమారు 20 వేల మంది ఉన్నారు. గుర్తింపు పొందని వారు వేలల్లో ఉన్నారు. ఎన్నో సంవత్సరాలుగా భవన నిర్మాణ కార్మికులు, యూనియన్లు ప్రభుత్వంపై ఒత్తడి తెచ్చి వివాహ కానుక, ప్రమాద బీమా, ప్రసూతి ఆనారోగ్యానికి సంబంధించి పథకాలను అమలు చేయించుకోగలిగారు. వివాహం కానుకగా రూ.10వేలు, ప్రమాదంలో మృతి చెందితే రూ.5 లక్షలు, ప్రసూతి నిమిత్తం రూ.5వేలు, ఆనార్యోగం సంభవిస్తే రూ.9వేలు భవన నిర్మాణ కార్మికులకు చెల్లించాలి. ప్రస్తుతం నియోజకవర్గంలో చాలా మంది భవన నిర్మాణ కార్మికులు బీమా పరిహారానికి పూర్తి స్థాయిలో నోచుకోలేదు. ప్రభుత్వం వద్ద ఉన్న కోట్లాది రూపాయలు భవన నిర్మాణ కార్మికుల నిధి ఉంది. ఆ నిధి నుంచి టీడీపీ ప్రభుత్వం దోమతెరలు, చలివేంద్రాలు, చంద్రన్న బీమా కార్యక్రమాలకు మళ్లించిందని కార్మికులు, యూనియన్లు ఆరోపిస్తున్నారు. ఆదరణ పథకం గాలిలోనే భవన నిర్మాణ కార్మికులకు ఆదరణ పథకం ద్వారా లబ్ధి అంతంత మాత్రంగా ఉంది. కార్మికుల ఉపాధి,భవన నిర్మాణ సామగ్రి కోసం ఆదరణ పథకం ఏర్పాటు చేశారు. అయితే ఈ పథ«కం కింద ఇంటర్వ్యూలకు వెళ్లినా ఇంత వరకు వారికి సామగ్రి ఇవ్వలేదు. ఎంపికైన వారి నుంచి రూ.2వేలు కట్టించుకున్నారని కార్మికులు చెబుతున్నారు. ప్రతిబంధకంగా నిబంధనలు గతంలో భవన నిర్మాణ కార్మికుల ఇంట్లో పెళ్లయితే దరఖాస్తుకు ఫోటో జతపరిస్తే సరిపోయేది. ప్రస్తుతం గ్రామ కార్యదర్శి సంతకం ఉండటమే కాకుండా మగపెళ్లి వారు గ్రామ కార్యదర్శి సంతకం, ధ్రువీకరణ పత్రాలు, సంబంధిత వ్యక్తులు కావాలన్న నిబంధన విధించారు. దీంతో అనేక మంది బీమా సదుపాయం కోసం దరఖాస్తు చేయటానికి వెనకాడుతున్నారు. ప్రభుత్వం స్థానిక అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితులు తనిఖీ చేసి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుదారులకు బీమా సదుపాయం మంజూరు చేయాలని భవన నిర్మాణ కార్మికులు కోరుతున్నారు. కార్మికుల నడ్డివిరగకొట్టడమే అనునిత్యం కాయాకష్టం చేస్తున్న కార్మికులకు వర్తించే సంక్షేమ నిధులను ప్రభుత్వం ఇతర పథకాలకు మళ్లించింది. ఈ చర్య కార్మికులు, వారి కుటుంబ సభ్యుల జీవన విధానానికి అడ్డుతగలడమే. ఈ విధానంతో కార్మికులు నడ్డివిరగకొడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా భనవ నిర్మాణ కార్మికులకు బీమా, పరిహారం అందజేయాలి. – ఎస్.రాధాకృష్ణ, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఎర్రగుంట్ల -
రెండు సెంట్ల స్థలం కోసం కన్నతల్లినే..
సాక్షి, వైఎస్సార్‌జిల్లా : జిల్లాలో దారుణం జరిగింది. రెండు సెంట్ల స్థలం కోసం కన్న తల్లినే హతమార్చారు ఇద్దరు కసాయి కూతుళ్లు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వైఎస్సార్‌జిల్లాలోని ఎర్రగుంట్ల ఇందిరమ్మ ఎస్సీ కాలనీకి చెందిన బొజ్జావుల సుగుణమ్మ(75)కు ప్రభుత్వం ఇచ్చిన రెండు సెంట్ల స్థలం ఉంది. అయితే ఆ స్థలాన్ని తమకు రాసివ్వాలని ఆమె కూతుళ్లు కోరారు. దీనికి ఆమె నిరాకరించారు. దీంతో ఆగ్రహానికి లోనైన ఇద్దరు కూతుళ్లు సుగుణమ్మపై దాడికి దిగారు. తలపై తీవ్రంగా కొట్టి సిమెంట్ రోడ్డుపై పడేశారు. తీవ్రగాయలైన సుగుణమ్మను స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. స్థలాన్ని తమ సోదరీమణులకు రాసివ్వకపోవడంతో దాడి చేసి కొట్టి చంపారని మృతురాలి కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టామని ఎర్రగుంట్ల పోలీసులు తెలిపారు. -
ఏసీబీకి చిక్కిన రైల్వే హెడ్ కానిస్టేబుల్
సాక్షి, ఎర్రగుంట్ల: లంచం తీసుకుంటూ ఓ రైల్వే పోలీసు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) వలలో చిక్కారు. వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల రైల్వే పోలీస్ స్టేషన్లో దేవానందం అనే వ్యక్తి హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఓ కేసు విషయమై రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖాధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. -
నాలుగోరోజు వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర
-
ముగిసిన నాలుగోరోజు ప్రజాసంకల్పయాత్ర
సాక్షి, జమ్మలమడుగు : ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర నాలుగోరోజు జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల శివారులో ముగిసింది. పాదయాత్రలో భాగంగా జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఎర్రగుంట మండలంలో ఆయన ప్రజలతో మమేకం అవుతూ ముందుకు సాగారు. పరిసర గ్రామాలలో అభిమానులు, కార్యకర్తలు నీరాజనలు పలికారు. మహిళలు వైఎస్ జగన్‌కు హారతులు పడుతూ, కుంకుమలు పెట్టి తమ సోదరుడిల భావించి రక్షబంధనం కట్టి తాము వేసిన ముగ్గులతో స్వాగతం పలుకుతూ ఆహ్వానించారు. ఎర్రగుంట్ల నాలుగురోడ్ల కూడలిలో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. గురువారం ఉదయం 8.40 గంటలకు వైఎస్ జగన్ ఉరుటూరు శివారు నుంచి నాలుగో రోజు యాత్ర మొదలు పెట్టారు. ఆయన వెంట నడిచేందుకు అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అక్కడి నుంచి సర్వరాజపేట మీదుగా పెద్దన్నపాడు చేరుకున్నారు. జగనన్నపై అభిమానులు పూలవర్షం కురిపించారు. అడుగడుగునా ఆత్మీయ స్వాగతం పలికారు. తర్వాత వైకోడూరు జంక్షన్లో రైతులతో ముఖాముఖి మాట్లాడారు. అన్నదాతలను అన్నివిధాల ఆదుకుంటామని హామీయిచ్చారు. నాలుగోరోజు పాదయాత్రలో భాగంగా 12.2 కిలోమీటర్లు నడిచిన వైఎస్ జగన్ ఎర్రగుంట్ల శివారులో యాత్రను ముగించారు. -
బీజేఎంఎం జిల్లా అధ్యక్షుడిగా శివరామిరెడ్డి
ఎర్రగుంట్ల: మండల పరిధిలోని కలమల్ల గ్రామానికి చెందిన ఆర్టీపీపీ కాంట్రాక్టుర్ శివరామిరెడ్డి బీజేఎంఎం జిల్లా అ«ధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ మేరకు అదివారం విజయవాడలో జరిగిన బీజేఎంఎం రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బారావు ఆయనకు నియామకపు పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శివరామిరెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. బీజేఎంఎం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. -
పోలీసుల అదుపులో ఏడుగురు తమిళ కూలీలు
ఎర్రగుంట్ల: ఎర్రగుంట్ల– కమలాపురం మార్గంలో ఆర్టీసీ బస్సులో వెళుతున్న ఏడుగురు తమిళ కూలీలను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ ఆర్ఐ అలీబాషా, ఎఫ్ఆర్వో రమణారెడ్డి తెలిపారు. శనివారం ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్లో ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు. తమిళ కూలీల ఆచూకీ కోసం తిరుపతి టాస్క్‌ఫోర్స్ ఆర్ఎస్ఐ ప్రసాద్, హెడ్ కానిస్టేబుల్ నర్సింహ, కానిస్టేబుళ్లు హుస్సేన్, నర్సింహలు ఆర్టీసీ బస్సులో వస్తుండగా బస్సులో అనుమానాస్పదంగా కనిపించిన ఏడుగురు తమిళ కూలీలను అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. పూర్తి సమాచారం కోసం వారిని విచారిస్తున్నామని పేర్కొన్నారు. -
బస్సును కారు ఢీ కొని ముగ్గురికి గాయాలు
ప్రొద్దుటూరు క్రైం: స్థానిక మోడంపల్లె బైపాస్ రోడ్డులో ముందు వెళ్తున్న బస్సును కారు ఢీ కొన్న సంఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఎర్రగుంట్లకు చెందిన రిటైర్డు ఎల్ఐసీ డెవలప్మెంట్ ఆఫీసర్ రామసుబ్బారెడ్డి, ఎల్ఐసీ ఏజెంట్లు సుదర్శన్, అబ్దుల్‌షరీఫ్‌లు కారులో గురువారం సాయంత్రం ఎర్రగుంట్ల నుంచి జమ్మలమడుగుకు బయలుదేరారు. ప్రొద్దుటూరులో కొంచెం పని ఉందని, చూసుకొని వెళ్దామని రామసుబ్బారెడ్డి బైపాస్‌రోడ్డు గుండా మైదుకూరు రోడ్డు వైపు కారు తిప్పాడు. అయితే బైపాస్‌రోడ్డులోని శ్రీ చైతన్య స్కూల్ సమీపంలోకి వెళ్లగానే ముందు వైపు పులివెందుల నుంచి ప్రొద్దుటూరుకు వెళ్తున్న ఏపీ04 టిటి 9988 నెంబర్ గల ఆర్టీసీ బస్సును వారి కారు ఢీ కొంది. బస్సును ఢీ కొనడంతో కారు అదుపు తప్పి రోడ్డు పక్కకు వెళ్లింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి. డ్రైవింగ్ చేస్తున్న రామసుబ్బారెడ్డి తీవ్రంగా గాయ పడ్డారు. గాయపడిన వారిని వెంటనే 108 అంబులెన్స్‌లో జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బస్సు కండక్టర్ బియ్యంశెట్టి వీరవెంకటప్రతాప్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చలపతి తెలిపారు. -
ఎట్టకేలకు 'రొమాంటిక్' బాబా అరెస్ట్
-
ఎట్టకేలకు 'రొమాంటిక్' బాబా అరెస్ట్
ప్రొద్దుటూరు : స్వామిజీ వేషంలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న'రొమాంటిక్' బాబాను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. అతనికి కోర్టు వచ్చే నెల 7వ తేదీ వరకు రిమాండ్ విధించింది. అయితే స్వామిజీ వేషంలో ఉన్న వ్యక్తికి మతిస్థిమితం సరిగాలేదన్న కారణంతో.... వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు తిరిగి ఎర్రగుంట్లకు తీసుకెళ్లారు. స్వామిజీ వేషంలో ఉన్న వ్యక్తి వద్ద సుబ్బారెడ్డితోపాటు మరో ఇద్దరు...స్వామీజీని నమ్ముకుంటే ఎలాంటి సమస్యలున్నా తీరుతాయని, పిల్లలు లేనివారికి సంతానం కలుగుతుందని, స్వామి వద్దకు వస్తే దెయ్యాలు పోతాయంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దాంతో తన వద్దకు వచ్చిన మహిళల పట్ల స్వామిజీ వేషంలో ఉన్న వ్యక్తి వెకిలిగా ప్రవర్తించేవాడు. ఇటీవల అయ్యప్పస్వామి దేవాలయంలో జరిగిన లక్షార్చన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న చాలా మంది... స్వామీజీ వేషంలో ఉన్న మతిస్థిమితం లేని వ్యక్తిని చూసి ప్రలోభాలకు గురయ్యారు. స్వామీజీ వేషంలో ఉన్న వ్యక్తిని కోర్టు తిరిగి పోలీసులకు అప్పగించడంతో... పోలీసులకు తిప్పలు తప్పలేదు. అతన్ని పోలీస్ స్టేషన్లో పెట్టుకోవడం కష్టంగా మారింది. ఏ క్షణంలో అతను ఏం చేస్తాడో తెలియని పరిస్థితుల్లో పోలీసులు కాపలాగా సిబ్బందిని ఉంచి పర్యవేక్షిస్తున్నారు. గురువారం క్రిస్మస్ కావటంతో కడప రిమ్స్‌కు తరలించినా అక్కడ వైద్యులు అందుబాటులో ఉండకపోవచ్చని పోలీసులు అప్పటివరకూ స్టేషన్లోనే ఉంచే అవకాశం ఉంది. మరోవైపు మూఢ విశ్వాసాల కారణంగా ప్రజల నకిలీ బాబాలను ఆశ్రయించటంపై విమర్శలు వస్తున్నాయి. -
నేటి విజయమ్మ పర్యటన వివరాలు
సాక్షి, కడప ప్రతినిధి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ జనభేరి ఎన్నికల ప్రచారం శుక్రవారం నాడు ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, ముద్దనూరులలో నిర్వహించనున్నట్లు ఆపార్టీ మున్సిపల్ ఎన్నికల పరిశీలకులు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి పేర్కొన్నారు. ఉదయం 9.00 గంటలకు ఎర్రగుంట్లలో విజయమ్మ రోడ్డు షో చేపట్టనున్నారు. అనంతరం 11.00 గంటలకు ప్రొద్దుటూరు చేరుకుని స్థానికంగా రోడ్డు షోలో పాల్గొని ప్రసంగించనున్నారు. 3.00 గంటలకు జమ్మలమడుగు మున్సిపల్ పరిధిలోనూ, 6.00 గంటలకు ముద్దనూరులో రోడ్డు షో నిర్వహించనున్నట్లు శివశంకరరెడ్డి తెలిపారు. పర్యటనను జయప్రదం చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.