
వైఎస్సార్ జిల్లా : రెండు లారీలు ఢీకొన్న సంఘటనలో ఓ స్కూటరిస్టు మృతి చెందాడు. ఈ సంఘటన ఎర్రగుంట్ల మండలం తిప్పలూరు గ్రామం వద్ద చోటుచేసుకుంది. ఆర్మీలో పనిచేసి ప్రస్తుతం కడప ఎయిర్ పోర్ట్‌లో సెక్యూరిటీ అధికారిగా మురళీధర్ రెడ్డి(35) పనిచేస్తున్నారు. యర్రగుంట్లలోని తన అత్తమ్మ ఇంటికి బైక్‌పై బయలుదేరారు. తిప్పలూరు వద్ద వెనకవైపు నుంచి వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఎదురుగా వస్తున్న మరో లారీ ముందుపడిపోయాడు. అనంతరం రెండు లారీలు ఢీకొట్టడంతో, మధ్యలో పడిపోవడంతో మురళీధర్ రెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు. లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడు పీరాను 108లో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మురళీధర్ రెడ్డి స్వస్థలం పెద్దముడియం.
Comments
Please login to add a commentAdd a comment