
సాక్షి, వైఎస్సార్‌జిల్లా : జిల్లాలో దారుణం జరిగింది. రెండు సెంట్ల స్థలం కోసం కన్న తల్లినే హతమార్చారు ఇద్దరు కసాయి కూతుళ్లు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వైఎస్సార్‌జిల్లాలోని ఎర్రగుంట్ల ఇందిరమ్మ ఎస్సీ కాలనీకి చెందిన బొజ్జావుల సుగుణమ్మ(75)కు ప్రభుత్వం ఇచ్చిన రెండు సెంట్ల స్థలం ఉంది. అయితే ఆ స్థలాన్ని తమకు రాసివ్వాలని ఆమె కూతుళ్లు కోరారు. దీనికి ఆమె నిరాకరించారు.
దీంతో ఆగ్రహానికి లోనైన ఇద్దరు కూతుళ్లు సుగుణమ్మపై దాడికి దిగారు. తలపై తీవ్రంగా కొట్టి సిమెంట్ రోడ్డుపై పడేశారు. తీవ్రగాయలైన సుగుణమ్మను స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. స్థలాన్ని తమ సోదరీమణులకు రాసివ్వకపోవడంతో దాడి చేసి కొట్టి చంపారని మృతురాలి కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టామని ఎర్రగుంట్ల పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment