దర్శనమిస్తున్న అమ్మవార్లు
జమలాపురం (ఎర్రుపాలెం): తెలంగాణ తిరుపతిగా పేరొందిన జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలలో భాగంగా నాల్గవ రోజు శనివారం ఆలయ అర్చకులు వేద మంత్రాలతో శ్రీ స్వామి వారికి, శ్రీ అలివేలు మంగ, శ్రీ పద్మావతి అమ్మవార్లకు పంచామృతాలతో అభిషేకాలు చేశారు. రకరకాల కూరగాయలతో శ్రీ అలివేలు మంగ, శ్రీ పద్మావతి అమ్మవార్లను శాకంబరీదేవిగా అర్చకులు రాజీవ్ శర్మ, రఘు రామMృSష్ణ అలంకరించి అర్చనలు చేసి, భక్తులకు దర్శనం కల్పించారు. కన్నుల పండువగా శ్రీవారిని, అమ్మవార్లను భక్తులు తిలకించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. సాయంత్రం స్వామివారిని, అమ్మవార్లను మేళతాళాలతో ఆలయం చుట్టూ గిరి ప్రదక్షిణ చేశారు. గోవింద నామంతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. భక్తులకు శ్రీ వేంకటేశ్వర సేవాసమితి నిర్వాహకులు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎవి.రమణమూర్తి, ఆలయ చైర్మన్ ఉప్పల శివరామ ప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ ఎస్.విజయకుమారి, జూనియర్ అసిస్టెంట్ కెవిఆర్.ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.