డీఈఓ శామ్యూల్ మంగళవారం ఉదయం తనకల్లు, కొక్కంటి, ఈతోడు ఉన్నత పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
అనంతపురం ఎడ్యుకేషన్ : డీఈఓ శామ్యూల్ మంగళవారం ఉదయం తనకల్లు, కొక్కంటి, ఈతోడు ఉన్నత పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం 11.45 గంటలప్పుడు కొక్కంటి పాఠశాలకు వెళ్లారు. అక్కడ 6వ తరగతిలో కుర్చీలోనే కునుకు తీస్తున్న ఇంగ్లీష్ టీచరు ఎ.మురళీ ఆయన కంటపడ్డారు. తీవ్రంగా పరిగణించిన డీఈఓ క్లాస్ పీకి షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయుల అటెండెన్స్ రిజిష్టర్లు, విద్యార్థుల హాజరు, బోధన తీరును పరిశీలించారు.