డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ప్రాతినిధ్య వహిస్తున్న మెదక్ మున్సిపల్ కార్యాలయంలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ప్రజలకు సత్వర సేవలు అందటం లేదు. మొత్తం 18 పోస్టులకు గాను ప్రస్తుతం ఇద్దరే పనిచేస్తున్నారు. ముఖ్యంగా శానిటరీ ఇన్‌స్పెక్టర్ పోస్టు ఖాళీగా ఉంది. ఇద్దరు హెల్త్ అసిస్టెంట్లకు ఒక్కరే విధులు సాగిస్తున్నారు. శానిటరీ సూపర్‌వైజర్ ఒక పోస్టు ఖాళీగానే ఉంది. టౌన్ ప్లానింగ్(టీపీబీవో) అధికారులు ఇద్దరికి గాను ఒక్కరే ఉన్నారు. ఒక జూనియర్ అసిస్టెంట్, ఆస్తిపన్ను వసూలు చేసే బిల్‌కలెక్టర్ రెండు పోస్టులు, జూనియర్ హెల్త్ అసిస్టెంట్ ఒక పోస్టు, పబ్లిక్ హెల్త్ వర్కర్లు ఆరు పోస్టులు, మరో టౌన్‌ప్లానింగ్(టీపీఎస్) ఒకటి ఖాళీగా ఉన్నాయి. ఎన్విరాన్‌మెంట్ ఇంజనీర్ కుర్చీ కూడా ఖాళీయే. ఇలా మొత్తం 16 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ప్రస్తుతం పనిచేసే సిబ్బంది పనిభారంతో సతమతమవుతున్నారు. పట్టణ ప్రజలకు మెరుగైన సేవలు అందడం కష్టంగా మారింది.
మెదక్ బల్దియాలో సిబ్బంది కొరత
Published Sun, Jul 17 2016 4:33 PM | Last Updated on Mon, Sep 4 2017 5:07 AM
Advertisement
Advertisement