సీఎం నాటిన మొక్కకు రక్షణ
గుండ్రాంపల్లి(చిట్యాల): చిట్యాల మండలంలోని గుండ్రాంపల్లి గ్రామంలో గత నెల 8వ తేదీన హరితహారం కార్యక్రమం ప్రారంభోత్సవంలో భాగంగా సీఎం కేసీఆర్ నాటిన వేప మొక్కకు ఆటవీ శాఖ అధికారులు రక్షణ గోడను ఏర్పాటు చేశారు. ఇటీవల వరకు ఎలాంటి రక్షణ లేకుండా ఉన్న సీఎం నాటిన మొక్క ప్రదేశాన్ని స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం గత నెల28వ తేదీన పరిశీలించారు. మొక్క చుట్టు రక్షణ గోడను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీంతో అధికారులు ఈ వేప మొక్క చుట్టు ఇటుకలతో రక్షణ గోడ నిర్మించారు.