వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం | simhadri appanna chandanotsavam starts in simhachalam | Sakshi
Sakshi News home page

వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం

Published Mon, May 9 2016 9:38 AM | Last Updated on Sun, Sep 3 2017 11:45 PM

వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం

వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం

విశాఖపట్నం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలం సింహాద్రి అప్పన్న చందనోత్సవం సోమవారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. శ్రీవరాహ లక్ష్మీనరసింహస్వామి చందనో త్సవానికి తొలి చందనాన్ని ఆలయ ప్రధాన అర్చకులు స్వామి వారికి నివేదన చేశారు.

వంశపారంపర్య ధర్మకర్త, కేంద్ర మంత్రి పూసపాటి అశోకగజపతిరాజు, ఆయన కుటుంబసభ్యులు సోమవారం తెల్లవారుజామున తొలి దర్శనం చేసుకోనున్నారు. ప్రభుత్వం తరఫున మంత్రి గంటా శ్రీనివాసరావు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయంలో గంటా ప్రత్యేక పూజలు నిర్వహించారు. చందోనత్సవ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయాధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement