‘కులానికో కార్పొరేషన్ కరెక్టు కాదు’ | singam sadasiva reddy statement on caste corporations | Sakshi
Sakshi News home page

‘కులానికో కార్పొరేషన్ కరెక్టు కాదు’

Published Thu, Nov 3 2016 10:23 PM | Last Updated on Mon, Sep 4 2017 7:05 PM

singam sadasiva reddy statement on caste corporations

అనంతపురం న్యూటౌన్‌ : కాపుల అభివృద్ధికి కృషి చేయాలంటే వారికి ఈబీసీ కింద రిజర్వేషన్లను కల్పిస్తే సరిపోతుందని, అలా కాకుండా సీఎం చంద్రబాబు వారిని బీసీలుగా గుర్తిస్తామంటూ ప్రకటించడం సరికాదని ఓసీ సంఘర్షణ సమితి జాతీయ అధ్యక్షులు సింగం సదాశివరెడ్డి గురువారం ఓ ప్రకటనలో విమర్శించారు.

ప్రతి కులానికి కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామనడం, ప్రత్యేక నిధులు కేటాయిస్తామనడం సబబుగా లేదన్నారు. దీనికంటే జనాభా దామాషా ప్రకారం అన్ని కులాల్లోని పేదవారికి ఓసీ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.