తుళ్లూరు: గుంటూరు జిల్లా ఉద్దండ్రాయుని పాలెంలో ఈ నెల 22వ తేదీన జరగనున్న అమరావతి రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి సింగపూర్ ప్రజాప్రతినిధులు రానున్నందున అధికారులు చేపట్టిన భద్రత చర్యలపై సింగపూర్ కాన్సులేట్ జనరల్ రాయ్‌కో ఆరా తీశారు. సభ ప్రాంగణాన్ని సోమవారం ఆయన బృందం పరిశీలించింది.
హెలిప్యాడ్ స్థలాన్ని, అక్కడ నుంచి వేదిక వద్దకు వచ్చే రోడ్డు మార్గాలపై ఆయన అధికారులతో చర్చించారు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండే, సీఆర్‌డీఎ సిబ్బంది భద్రత వివరాలను తెలియజేశారు. ఈ నెల 18 నుంచి భద్రత ఏర్పాట్లకు సంబంధించిన చర్యలు ఎస్‌పీజీ ఆధ్వర్యంలో కట్టుదిట్టంగా ఉంటాయని వివరించారు.
శంకుస్థాపన ఏర్పాట్లపై సింగపూర్ ప్రతినిధుల ఆరా
Published Tue, Oct 13 2015 9:08 AM | Last Updated on Wed, May 29 2019 3:19 PM
Advertisement
Advertisement