uddandrayunipalem
-
నందిగం సురేష్‌కు బాబూరావు క్షమాపణ
ఉద్దండరాయునిపాలెం (తాడికొండ): కొందరు వ్యక్తులు తనను ఆర్థికంగా ఆదుకుంటానని ప్రలోభపెట్టి ఎంపీ నందిగం సురేష్‌పై ఆరోపణలు చేయించారని బత్తుల బాబూరావు కన్నీటి పర్యంతమయ్యారు. అనారోగ్య కారణాల దృష్ట్యా పోలీసు ఉద్యోగానికి దూరమైన బత్తుల బాబూరావు సిఫార్సు నిమిత్తం ఎంపీ నందిగం సురేష్‌ను కలవగా దాడి చేశారనే కథనాలు వెలువడిన నేపథ్యంలో ఆయన ఎంపీని కలిసి క్షమాపణ చెప్పారు. ఆదివారం రాత్రి తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో ఎంపీ నందిగం సురేష్ నివాసానికి వెళ్లిన బాబూరావు తీరని అన్యాయం చేశానని ఎంపీ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: అవినీతికి ‘సీమెన్స్’ ముసుగు కొందరు వ్యక్తులు తనను ప్రలోభాలకు గురిచేసి ఆదుకుంటానని చెప్పినందున అలా మాట్లాడానే తప్ప ఈ వ్యవహారం రాష్ట్రంలో ఇంత రాద్ధాంతం అవుతుందని తాను ఊహించలేదన్నారు. జరిగిన ఘటనలో ఎంపీ ప్రమేయం ఏమీ లేదని స్పష్టం చేశారు. కొన్ని చానళ్లలో వస్తున్న కథనాలు ఉద్దేశపూర్వకంగా, తనను తప్పుదారి పట్టించి మాట్లాడించిన మాటలే తప్ప వాటిలో నిజం లేదన్నారు. -
జర్నలిస్టులపై దాడి.. పోలీసుల అదుపులో టీడీపీ కార్యకర్తలు
సాక్షి, గుంటూరు : జిల్లాలోని ఉద్దండరాయనిపాలెంలో జర్నలిస్టులపై దాడికి పాల్పడిన ఘటనలో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. శుక్రవారం ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మౌనదీక్షను కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులపై అక్కడకు వచ్చిన బయట వ్యక్తులు కొందరు పరుష పదజాలంతో దూషిస్తూ కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు ఏడుగురు టీడీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని తెనాలి టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నవారిలో శివబాబు (వెంకటపాలెం ), నరేష్ (మోదుగుల లంకపాలెం), సురేంద్ర (వెంకటపాలెం), శ్రీనివాసరావు (వెంకటపాలెం), నాగరాజు (మోదుగుల లంకపాలెం), లోకనాయక్ (వెలగపూడి), నరసింహ స్వామి (నెక్కల్లు) ఉన్నారు. తనపై జరిగిన దాడికి సంబంధించి మహిళా జర్నలిస్టు దీప్తి నల్లమోతు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, కొంతకాలంగా అమరావతిలో రైతుల పేరిట టీడీపీ ఆందోళనలు నిర్వహిస్తుందనే ఆరోపణలకు ప్రస్తుత పరిణామాలు బలం చేకూర్చేలా ఉన్నాయి. చదవండి : రాజధానిలో హింసకు కుట్ర! వెంబడించి మరీ దాడి చేశారు : జర్నలిస్టులు రైతుల ముసుగులో జర్నలిస్టులపై దాడి -
శంకుస్థాపన ఏర్పాట్లపై సింగపూర్ ప్రతినిధుల ఆరా
తుళ్లూరు: గుంటూరు జిల్లా ఉద్దండ్రాయుని పాలెంలో ఈ నెల 22వ తేదీన జరగనున్న అమరావతి రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి సింగపూర్ ప్రజాప్రతినిధులు రానున్నందున అధికారులు చేపట్టిన భద్రత చర్యలపై సింగపూర్ కాన్సులేట్ జనరల్ రాయ్కో ఆరా తీశారు. సభ ప్రాంగణాన్ని సోమవారం ఆయన బృందం పరిశీలించింది. హెలిప్యాడ్ స్థలాన్ని, అక్కడ నుంచి వేదిక వద్దకు వచ్చే రోడ్డు మార్గాలపై ఆయన అధికారులతో చర్చించారు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండే, సీఆర్డీఎ సిబ్బంది భద్రత వివరాలను తెలియజేశారు. ఈ నెల 18 నుంచి భద్రత ఏర్పాట్లకు సంబంధించిన చర్యలు ఎస్పీజీ ఆధ్వర్యంలో కట్టుదిట్టంగా ఉంటాయని వివరించారు.