తండ్రి, కొడుకులను కాటేసిన పాము
Published Sat, Oct 15 2016 12:34 AM | Last Updated on Mon, Sep 4 2017 5:12 PM
- తండ్రి మృతి
- కుమారుడి పరిస్థితి విషమం
కౌతాళం: మండల పరిధిలోని కామవరం గ్రామంలో తండ్రి, కుమారుడిని పాము కాటేయగా తండ్రి మృతి చెందాడు. కుమారుడు పరిస్థితి విషమంగా ఉంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన కొలిమి ఖాజహుసేన్ (65), అతని కుమారుడు మహబూబ్ (30) బుధవారం రాత్రి ఇంటి బయట నిద్రించారు. అర్ధరాత్రి సమయంలో ఇద్దరిని పాము కాటు వేయడంతో స్థానికంగా నాటు వైద్యం వేయించారు. గురువారం సాయంత్రం వరకు వీరు బాగానే ఉన్న రాత్రి ఉన్నట్టుండి అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు చికిత్స కోసం ఆదోని ఆసుపత్రికి తరలిస్తుండగా ఖాజహుసేన్ కోలుకోలేక మార్గమధ్యంలోనే చనిపోయాడు. కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. శుక్రవారం ఉదయం తండ్రి అంతిమ సంస్కారాలకు కొడుకును ఆసుపత్రి నుంచి గ్రామానికి తీసుకొచ్చారు. ప్రస్తుతం అతని పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది.
Advertisement
Advertisement