
బావిలో నాగుపాము
పిచ్చాటూరులో గురువారం పాము బావిలోపడిపోయింది. బయటకు రాలేక అవస్థపడుతోంది. పిచ్చాటూరు టూటౌన్‌లో నివాసముంటున్న డాక్టర్ ముకుందరాజు ఇంటి పెరటిలోని బావిలో గురువారం తెల్లవారుజామున పాము పడిపోయింది. నీటిలో ఈదుతో బయట పడటానికి విశ్వప్రయత్నం చేస్తోంది. బావి లోపలి నుంచి బయటకు రావడానికి సిమెంట్ ఒరలపైకి పాకుతోంది. పట్టు దొరకక మళ్లీ నీటిలో పడిపోతోంది. పామును చూడటానికి జనాలు తరలివస్తున్నారు. స్థానికులు చివరకు అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు.
–పిచ్చాటూరు