సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య | Software engineer suicide | Sakshi
Sakshi News home page

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య

Published Wed, Jul 27 2016 7:59 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య - Sakshi

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య

 
 
 నాయుడుపేట : పట్టణంలో ఆర్టీసి బస్టాండ్‌ వద్ద ఉన్న ఓ లాడ్జిలో సాప్ట్‌వేర్‌ ఉద్యోగి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన బుధవారం ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు బుజబుజనెల్లూరుకు చెందిన దూర్జటి భరద్వాజ (30) చెన్నైలోని ఓ స్టాప్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నెల 24 సాయంత్రం భరద్వాజ లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్నాడు. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాడు. బుధవారం ఉదయం రూమ్‌ నంబర్‌ 211లో ఉంటున్న భరద్వాజ తలుపునకు గడియపెట్టి ఉండడంతో అనుమానించిన లాడ్జి సిబ్బంది యాజమాన్యానికి తెలియపరిచారు. తలుపు తీసే ప్రయత్నం చేసిన వీలు కాకపోయింది. పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై పీవీ నారాయణ సంఘటన స్థలానికి చేరుకుని లాడ్జి యజమాని వద్ద ఉన్న మరో తాళం చెవితో గది తలుపులు తెరిచారు. బెడ్‌పై భరద్వాజ లేకపోవడంతో బాత్‌రూంలో పరిశీలించారు. బాత్‌రూం గదిలో బేషిన్‌పై వెలికిలా పడి ఉండడాన్ని గుర్తించారు. మృతుడు భరద్వాజ దగ్గర ఉన్న ఐడీ కార్డులను పోలీసులు పరిశీలించారు. బుజబుజనెల్లూరు ఆర్టీసీ కాలనీలో నివాసముంటున్నట్లు పోలీసులు గుర్తించారు. తల్లిదండ్రులు, బంధువులకు సమాచారం అందించారు. మృతదేహానికి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement