నియమిత వేళల్లో స్పర్శదర్శనం
నియమిత వేళల్లో స్పర్శదర్శనం
Published Wed, Sep 21 2016 10:57 PM | Last Updated on Mon, Sep 4 2017 2:24 PM
శ్రీశైలం: భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సాధారణ రోజుల్లో నియమిత వేళల్లో భక్తులందరికీ స్పర్శదర్శన అవకాశం కల్పిస్తున్నట్లు ఈవో నారాయణ భరత్ గుప్త తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సాధారణ భక్తులకు స్పర్శదర్శనం నిలుపుదల చే యలేదని స్పష్టం చేశారు. గతంలో గర్భాలయంలో జరిగే అభిషేకాలను కేవలం 3 నుంచి 5 నిమిషాల్లోపే పూర్తి చేసేవారన్నారు. చాలా మంది భక్తులు అభిషేకాల నిర్వహణపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని, వీటన్నింటిని దష్టిలో పెట్టుకుని సామూహిక అర్జిత అభిషేకాలను ప్రవేశ పెట్టామన్నారు. రూ.5వేలు నిర్ణయించిన ఈ అభిషేక సేవలో రోజుకు కేవలం 24 టికెట్లను మాత్రమే అందుబాటులో ఉంచామని, 20 నిమిషాల పాటు శాస్త్రోక్తంగా అభిషేకాన్ని సేవాకర్తలు నిర్వహించుకోవచ్చునన్నారు. గతంలో శ్రీ స్వామివార్ల బిల్వార్చన రుసుం రూ. 3,116 ఉండగా.. నేడు బిల్వార్చన టికెట్‌ను రూ. 5వేలకు పెంచామన్నారు. గతంలో దంపతులు లేదా ఒక్కరికి కూడా అభిషేక రుసుం రూ. 1500లుగా ఉండగా, ప్రస్తుతం దంపతులకు రూ. 1500లను కొనసాగిస్తూ, ఒక్కరు అభిషేకం చేయాలనుకుంటే రూ. 750లుగా నిర్ణయించినట్లు చెప్పారు.
Advertisement
Advertisement