టెన్త్‌లో శతశాతం ఉత్తీర్ణతకు కృషి | special classes for tenth students | Sakshi
Sakshi News home page

టెన్త్‌లో శతశాతం ఉత్తీర్ణతకు కృషి

Published Sat, Aug 6 2016 11:46 PM | Last Updated on Mon, Sep 4 2017 8:09 AM

special classes for tenth students

అరకులోయ: జిల్లాలో ఈఏడాది పదో తరగతిలో శతశాతం ఉత్తీర్ణత సాధించేందుకు కషి చేస్తున్నామని జిల్లా విద్యాశాఖాధికారి కష్ణారెడ్డి తెలిపారు. శనివారం ఆయన మండలంలోని  ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, పానిరంగిని, పెదలబుడు, లిట్టిగుడ ప్రాథమిక పాఠశాలలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. దసరా సెలవుల అనంతరం టె¯Œæ్త విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. గత ఏడాది జిల్లాలో 10వ తరగతిలో 94 శాతం ఉత్తీర్ణత సాధించామని, ఈ ఏడాది శతశాతం ఉత్తీర్ణత సాధిస్తామని చెప్పారు. ఏజెన్సీలో 45 ప్రాథమిక పాఠశాలలు వివిధకారణాల వల్ల మూసివేశామని, వీటిలో 30 పాఠశాలలు పునః ప్రారంభించామన్నారు. ప్రతి పాఠశాలలో మరుగుదొడ్లు నిర్మిస్తున్నామని, రన్నింగ్‌ వాటర్‌ లేని పాఠశాలల్లో పాఠశాల యాజమన్యం ద్వారా బకెట్‌లతో నీరు తెచ్చెలే ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రహరీలేని పాఠశాలలకు బయో ఫెన్సింగ్‌ ఏర్పాటు చేస్తామన్నారు. శిథిలమైన భవనాల్లో తరగతులు నిర్వహించరాదని ఇప్పటికే ఉపాధ్యాయులకు సూచించామని చెప్పారు. విధులు సక్రమంగా నిర్వహించకుండా సమయపాలన పాటించని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.  ఈ కార్యక్రమంలో ఏజెన్సీ డిప్యూటీ డీఈవో కొర్రా సువర్ణ, ఎంఈవో శెట్టి సుందరరావు, ఉపాధ్యాయులు కన్నబాబు, శంకర్‌ పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement