స్పెషల్ ప్రొటెక్షన్ | Special Protection | Sakshi
Sakshi News home page

స్పెషల్ ప్రొటెక్షన్

Published Wed, Nov 2 2016 3:40 AM | Last Updated on Tue, Aug 28 2018 5:43 PM

స్పెషల్ ప్రొటెక్షన్ - Sakshi

స్పెషల్ ప్రొటెక్షన్

ప్రపంచస్థాయి పుణ్యక్షేత్రంగా రూపుదిద్దుకుంటున్న యూదాద్రి శ్రీలక్ష్మీనారసింహస్వామి దేవస్థానం భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.  ప్రత్యేక సాయుధ దళం ఏర్పాటుకు సీఎం కేసీఆర్ రూపకల్పన చేస్తున్నారు. ఇప్పటికే ఉన్నతాధికారులతో సమీక్షలు జరిపారు. మొత్తంగా ప్రత్యేక పోలీస్ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయిం చారు. దీంతో యూదాద్రి చుట్టూ భద్రత బలగాలు నిరంతరం పర్యవేక్షించనున్నాయి   
 - సాక్షి, యాదాద్రి

 
 సాక్షి, యాదాద్రి : తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేయదల్చిన తెలంగాణ ప్రభుత్వం అదేస్థాయిభద్రతకు పెద్దపీట వేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సుమారు రూ.వెరుు్య కోట్ల వ్యయ ప్రతిపాదనతో యాదాద్రి అభివృద్ధికి వడివడిగా ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. దేశ ప్రధాని సైతం ప్రత్యేకంగా గుర్తించిన యాదాద్రి క్షేత్రానికి భద్రతకు సీఎం ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు. పోలీస్ ఉన్నతాధికారులతో పలుమార్లు సమీక్షలు నిర్వహించి యాదాద్రి దేవస్థానం రక్షణకు పోలీస్ దళాన్ని ఏర్పాటు చేసేందుకు రూపకల్పన చేశారు.
 
  అయితే కేసీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి 8సార్లు యాదగిరిగుట్టకు వచ్చారు. అలాగే రాష్ర్టపతి ప్రణబ్‌ముఖర్జీ, గవర్నర్ నరసింహన్ సైతం ఇప్పటికే యాదాద్రిస్వామిని దర్శించుకున్నారు. వీవీఐపీలు, వీఐపీలు వచ్చిన ప్రతిసారి పోలీస్ యంత్రాంగం భారీ బందోబస్తు నిర్వహించడం కోసం జిల్లా నలుమూలల నుంచి సిబ్బందిని రప్పిస్తున్నారు. దీని వల్లవ్యయ ప్రయాసలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో యాదాద్రి పుణ్యక్షేత్రానికి ప్రత్యేక పోలీస్ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇటీవల సీఎం కేసీఆర్ పోలీస్ ఉన్నతాధికారులతో యాదాద్రి పోలీస్ వ్యవస్థపై సమీక్ష కూడా నిర్వహించారు.
 
 ఇదీ స్వరూపం..
  యాదాద్రి పుణ్యక్షేత్రం భద్రత బాధ్యతలను చూడడానికి ఏసీపీ స్థాయిలో అధికారి పర్యవేక్షణలో ప్రత్యేక పోలీస్ డివిజన్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో కొండపైన అప్‌హిల్ పోలీస్ స్టేషన్, సీసీఎస్, మహిళా పోలీస్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, ప్రస్తుతం ఉన్న యాదగిరి గుట్ట పీఎస్‌తోపాటు మరో పీఎస్ ఏర్పాటు అవుతుంది. వీటికి స్టేషన్ హౌస్ అధికారులుగా ఇన్‌స్పెక్టర్‌లు ఉంటారు. దీంతోపాటు ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులతో కలిపి మొత్తం 300 మంది వరకు అదనంగా రానున్నారు.
 
 సాయుధ దళం ఏర్పాటు
 యూదాద్రికి వీవీఐపీలు వచ్చినపుడు, అత్యవసర పరిస్థితుల్లో రక్షణ బాధ్యతలను చూడడానికి సాయుధ దళాన్ని ఏర్పాటు చేస్తారు. రిజర్వ్‌పోలీస్, అక్టోపస్ గ్రేహౌండ్స్ పోలీస్‌లు నిరంతరం అందుబాటులో ఉంటారు. ఇందులో మొత్తం మూడు ప్లాటూన్ల సాయుధ పోలీస్‌లు నిరంతరం యాదాద్రిక్షేత్ర రక్షణ బాధ్యతలను చూస్తుంటారు. ఇందులో 25 మంది అక్టోపస్ పోలీస్ దళం ఉంటుంది.
 
 స్థలం కేటాయింపు
  యాదాద్రి క్షేత్రం అభివృద్ధికోసం కేటాయించిన భూమిలోనే 13 ఎకరాల స్థలం యాదాద్రి ప్రొటెక్షన్ ఫోర్స్‌కోసం కేటాయించారు. ఇందులోనే ప్రధాన కార్యాలయాలు, పరేడ్ గ్రౌండ్, శిక్షణ  కేంద్రం క్వార్టర్లు నిర్మిస్తారు. పోలీస్ యంత్రాంగానికి కావల్సిన స్థలాన్ని వైటీడీఏ ఇప్పటికే కేటాయించింది. దీంతో ఇకనుంచి యూదాద్రి పుణ్యక్షేత్రం ప్రత్యేక సాయుధ దళం భద్రత పరిధిలోకి వెళ్లనుంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement