- మాజీ కేంద్ర మంత్రులు
హోదా కోసం పోరాడుదాం
Published Fri, Sep 30 2016 11:37 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
అమలాపురం టౌన్ :
ప్రత్యేక హోదా సాధన కోసం గ్రామ స్థాయి నుంచి పోరాటాలు చేసేలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సిద్ధం కావాలని కేంద్ర మాజీ మంత్రులు జేడీ శీలం, ఎంఎం పల్లంరాజు పిలుపునిచ్చారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి గిడుగు రుద్రరాజు అధ్యక్షతన స్థానిక షాదీఖానాలో శుక్రవారం జరిగిన నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి కేంద్ర మాజీ మంత్రులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పార్టీని క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేసుకునేందుకు గ్రామ స్థాయిల్లో పార్టీ కమిటీలను బలోపేతం చేసేందుకు కసరత్తు మొదలు పెడుతున్నట్లు వారు తెలిపారు. రాష్ట్ర విభజన చట్టం ఆమోదంలో నాటి యూపీఏ ప్రభుత్వం తోపాటు బీజేపీ కూడా కీలక పాత్ర పోషించిందని, నేడు బీజేపీ మాట మారుస్తూ రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని జేడీ శీలం ఆవేదన వ్యక్తం చేశారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి జంగా గౌతమ్, డీసీసీ అధ్యక్షుడు కందుల దుర్గేష్, పార్టీ పరిశీలకుడు మాజీ ఎమ్మెల్సీ వెంకటేశ్వరరెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు నూటికుర్తి వెంకటేశ్వరరావు,పీసీసీ అధికార ప్రతినిధి ముషిణి రామకృష్ణారావు, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు అయితాబత్తుల సుభాషిణి మాట్లాడారు. నియోజకవర్గంలో పార్టీ పగ్గాలు చేపట్టే నాయకుడిని సూచించాలని అన్ని స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేయాలని వారు కోరారు.
Advertisement
Advertisement