దేశం గర్వించే క్రీడాకారులుగా ఎదగాలి
-
ఏపీటీటీఏ అధ్యక్షుడు భాస్కరరామ్
-
రంజీ క్రికెట్ జట్టుకు ఎంపికైన క్రీడాకారులకు సత్కారం
క్రికెట్‌లో ప్రతిభ కనబరిచి దేశం గర్వించే క్రీడాకారులుగా ఎదగాలని ఆంధ్రప్రదేశ్ టేబుల్‌టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.భాస్కరరామ్ అన్నారు. రాజమహేంద్రవరానికి చెందిన కె.శ్రీకాంత్, ఐ.కార్తీక్ రామన్ ఆంధ్రప్రదేశ్ క్రికెట్ రంజీ టీమ్‌కు ఎంపికైన నేపథ్యంలో వారిని ఆదివారం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో సిటీ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. భాస్కరరామ్ మాట్లాడుతూ క్రికెట్ అభివృద్ధికి తనవంతు సాయం అందిస్తానన్నారు. కార్యక్రమంలో క్రికెట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు విజయకుమార్ బాబు, ఉపాధ్యక్షుడు దివాకర్, సిటీ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు నక్కా శ్రీనగేష్, గొర్రెల సురేష్, ఏ.రాజ
గోపాల్, కోచ్ జీరి హరనాథ్‌రెడ్డి పాల్గొన్నారు.