
శ్రీగంధం మొక్కలు స్వాధీనం
నంద్యాల: నల్లమల నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న శ్రీ«గంధం మొక్కలను అటవీ శాఖ అధికారులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. మహానంది మండలం గాజులపల్లె గ్రామానికి చెందిన మాబు గిద్దలూరు నుంచి నంద్యాలకు వస్తున్న శీతల పానియాల లారీ ఎక్కారు. అటవీ శాఖ అధికారులకు అందిన సమాచారం మేరకు అయ్యలూరు మెట్ట వద్ద లారీ ఆపి మాబును సోదా చేశారు. అతని వద్ద దాదాపు రూ.25వేల విలువ గల 11కేజీల శ్రీగంధం మొక్కలు లభ్యమయ్యాయి. అతడితో పాటు లారీ డ్రైవర్ బాలకృష్ణను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. సోదాల్లో అటవీ శాఖ టౌన్ రేంజ్ అధికారి అబ్దుల్‌ఖాదర్, బీట్ ఆఫీసర్ లక్ష్మయ్య పాల్గొన్నారు.