రాష్ట్ర ఆర్చరీ సంఘం కోశాధికారిగా శంకరయ్య | State aartchary tresarar shankaraiah | Sakshi
Sakshi News home page

రాష్ట్ర ఆర్చరీ సంఘం కోశాధికారిగా శంకరయ్య

Published Sun, Aug 21 2016 11:54 PM | Last Updated on Mon, Sep 4 2017 10:16 AM

పుట్టా శంకరయ్య

పుట్టా శంకరయ్య

ఖమ్మం స్పోర్ట్స్‌: తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్‌ కోశాధికారిగా జిల్లా ఆర్చరీ అసోసియేషన్‌ కార్యదర్శి, కిన్నెరసాని ఆశ్రమ క్రీడా పాఠశాల క్రీడల ఇన్‌చార్జి, ఫిజికల్‌ డైరెక్టర్‌ పుట్టా శంకరయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆర్చరీ అసోసియేషన్‌ కార్యవర్గ సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. అదేవిధంగా జిల్లా ఆర్చరీ అసోసియేషన్‌ అధ్యక్షుడు సాధుల సారంగపాణి తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్‌ కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు. రాష్ట్ర స్థాయి తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్‌లో సముచిత స్థానం  కల్పించడం పట్ల జిల్లా ఆర్చరీ అసోసియేషన్‌ అధ్యక్షుడు సాధుల సారంగపాణి హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement