జడ వేయలేదని విద్యార్థిని ఆత్మహత్య | student suicide in suspect case in chaithanyapuri | Sakshi
Sakshi News home page

జడ వేయలేదని విద్యార్థిని ఆత్మహత్య

Published Tue, Sep 6 2016 10:35 PM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM

జడ వేయలేదని విద్యార్థిని ఆత్మహత్య - Sakshi

జడ వేయలేదని విద్యార్థిని ఆత్మహత్య

చైతన్యపురి: తల్లి జడ వేయలేదని మనస్తాపంతో ఓ ఇంటర్‌ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సరూర్‌నగర్‌ పోలీస్‌స్టేన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ వెంకటకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం....  కర్మన్ ఘాట్‌ క్రాంతినగర్‌కు చెందిన రాములు స్థానికంగా హోటల్‌ నిర్వహిస్తున్నాడు. అతని కూతురు భాగ్యలక్ష్మీ (17) శ్రీసాయి కళాశాలలో ఇంటర్‌ చదువుతోంది. మంగళవారం ఆమె తన తల్లి విజయలక్ష్మిని జడవేయమని కోరగా వేరే పని ఉన్నందున వేయలేదు.

దీంతో అలిగిన భాగ్యలక్ష్మి కాలేజీకి  వెళ్లకుండా భాగ్యలక్ష్మి ఇంట్లోనే ఉంది. తండ్రి హోటల్‌కు వెళ్లగా తల్లి, సోదరుడు జిల్లెలగూడలోని బంధువుల ఇంటికి వెళ్లడంతో తలుపు గడియ వేసుకుని కిటికీ గ్రిల్స్‌కు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటికి తిరిగి వచ్చి తల్లి తలుపుకొట్టినా తీయకపోవడంతో స్థానికుల సహాయంతో గడియ విరగొట్టి లోపలికి వెళ్లి చూడగా భాగ్యలక్ష్మి ఉరి వేసుకుని చనిపోయి కనిపించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement