నెల్లూరు : కళాశాల లెక్చరర్ కొట్టాడనే కారణంతో కోవూరులోని గీతాంజలి కాలేజీ ఎదుట గురువారం విద్యార్ధులు ఆందోళకు దిగారు. గీతాంజలి కాలేజీలో బుధవారం ఇంటర్నల్ ఎక్జామ్స్ జరిగాయి. బీటెక్ ట్రిపుల్‌ఈ రెండో సంవత్సరం విద్యార్థి సంతోష్ కుమార్ పరీక్ష రాసి పేపర్ ఇచ్చేశాడు. ఇంకా సమయం ఉంది అక్కడే కూర్చో అని ఇన్విజిలేటర్ ప్రణయ్ కుమార్ సదరు విద్యార్థికి చెప్పాడు. సంతోష్ తన పేపర్‌ను పక్కన పెట్టి అలాగే సీట్లో కూర్చున్నాడు.
అయితే పక్కన పెట్టిన పేపర్‌ను వెనకాల విద్యార్థి కాపీ చేయడాన్ని లెక్చరర్ గుర్తించాడు. ఆ క్రమంలో సదరు ఇద్దరు విద్యార్థులను మందలించాడు. ఈ విషయంలో లెక్చరర్ తమపై చేయి చేసుకున్నాడని, లెక్చరర్‌పై చర్య తీసుకోవాలని కోరుతూ విద్యార్థులు గురువారం తరగతులను బహిష్కరించారు. తోటి విద్యార్థులతో కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు.