బస్సులకోసం విద్యార్థుల రాస్తారోకో | students protest for rtc bus | Sakshi
Sakshi News home page

బస్సులకోసం విద్యార్థుల రాస్తారోకో

Published Fri, Jul 29 2016 7:21 PM | Last Updated on Mon, Sep 4 2017 6:57 AM

students protest for rtc bus

జగిత్యాల రూరల్‌ : విద్యార్థులకు ఆర్టీసీ బస్సులు నిలపడం లేదని జాబితాపూర్‌ గ్రామానికి చెందిన 100 మంది విద్యార్థులు శుక్రవారం జగిత్యాల–గొల్లపల్లి రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. విద్యార్థులు మాట్లాడుతూ కళాశాలలకు వెళ్లేందుకు బస్‌పాస్‌లు తీసుకున్నామని గ్రామంలో బస్సులు ఆపడం లేదన్నారు. అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న రూరల్‌ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని బస్సులు నడిపేలా అధికారులతో మాట్లాడుతామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళనవిరమించారు. సుమారు గంటపాటు రాస్తారోకో నిర్వహించడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement