పట్టు జారితే... పెనుప్రమాదమే | RTC bus travel safe | Sakshi
Sakshi News home page

పట్టు జారితే... పెనుప్రమాదమే

Published Thu, Aug 6 2015 3:50 AM | Last Updated on Sun, Sep 3 2017 6:50 AM

పట్టు జారితే... పెనుప్రమాదమే

పట్టు జారితే... పెనుప్రమాదమే

 ప్రొద్దుటూరు టౌన్ : ఆర్‌టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం..టాప్‌పై ప్రయాణం నేరం..ప్రజా సేవలో ఆర్‌టీసీ..ఇవి నినాదాలు.. మరి ఒకే ట్రిప్పులో 200 మంది ప్రయాణం ఎలా ఉంటుందో ఊహించుకోండి..అవును ఇది నిజం. ఏకంగా టాప్‌పైనే 80 మందికిపైగా విద్యార్థులు ప్రాణాలు  అరిచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు.

 ప్రొద్దుటూరు నుంచి కల్లూరు, రాజుపాళెం, చాపాడు మండలంలోని పల్లవోలు, చాపాడు, నక్కలదిన్న వెదురూరు-రాజుపాళెం, దువ్వూరు, చౌడూరు తదితర రూట్లలో దాదాపు 8500 మంది విద్యార్థులు ఆర్‌టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు పాస్‌లు తీసుకున్నారు. ఇందులో 2000 పాసులో ఉచితం కాగా. 6500 పాస్‌లు డబ్బు చెల్లించినవే. యూకేజీ నుంచి, పీజీ, ఇంజనీరింగ్ కళాశాలలు ప్రొద్దుటూరులో పెద్ద సంఖ్యలో ఉండడంతో పల్లెల నుంచి విద్యార్థులు రకపోకలు సాగిస్తున్నారు. ప్రొద్దుటూరు -కల్లూరు రూట్‌లో దాదాపు 150 మందికి పైగా విద్యార్థులకు బస్సు పాసులు ఉన్నాయి.

ఈ రూట్‌లో బస్సు 6.30 గంటలకు పట్టణానికి కల్లూరు నుంచి బయల్దేరుతుంది. కల్లూరు, తాళ్లమాపురం, లింగాపురం, ఖాదర్‌బాద్‌ల మీదుగా పుట్టపర్తి సర్కిల్ వరకు వస్తుంది. కల్లూరులోనే బస్సు ఫుల్ అయి లోపల గాలి కూడా ఆడలేని పరిస్థితి ఉంటుంది. టాప్‌పైన మరో 100 మందికి పైగా విద్యార్థులు ఎక్కుతారు. ఈ బార్గంలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉండడం వల్ల డ్రయివర్ కూడా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని, బస్సు పక్కకు ఒరుగుతుందనే ఆందోళనతో నెమ్మదిగా తీసుకొస్తాడు. బస్సును పట్టుకుని వేలాడు విద్యార్థులు సైతం ప్రాణాలతో చెలగాటం ఆడుతుంటారు. ఆ బస్సు తప్పిపోతే కళాశాలలకు, పాఠశాలలకు సమయానికి చేరుకోలేమన్నది విద్యార్థుల ఆందోళన

 పట్టుతప్పితే...
 బస్సు పట్టు తప్పితే ప్రాణాలు పోవాల్సిందే. అనంతపురం జిల్లా పెనుగొండ వద్ద ఇటీవల పల్లె వెలుగు బస్సు బోల్తా పడి 16 మంది విద్యార్థులు మృతి చెందిన సంఘటన ఇంకా మదిలో మెదులుతూనే ఉంది. ఆ తల్లితండ్రుల ఆవేదన ఎవరూ తీర్చలేనిది. ఇంత మంది విద్యార్థులు బస్సులో ప్రయాణిస్తారని తెలిసి కూడా ఆర్‌టీసీ అధికారులు చర్యలు తీసుకోకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనం అని పిల్లల తల్లితండ్రులు అంటున్నారు.
 
 బస్సు వాలుతుంటుంది...
 బస్సు నడపాలం టే భయమేస్తుం ది. ఒక పక్కకు బస్సు వాలుతుం టుంది.ఏంచే యాలి. ప్రాణా లు అరచేతిలో పెట్టుకుని నడుపుతున్నా. లోపల స్థలం లేక.టాప్‌పైన పెద్ద సంఖ్యలో విద్యార్థులు కూర్చుం టారు. - జక్కయ్య, ఆర్‌టీసీ డ్రైవర్
 
 150 మందికి పైగా విద్యార్థులే
 ఉదయం ట్రిప్‌లో 150 మందికి పైగా విద్యార్థులు బస్సు ఎక్కుతారు. లోపల అంతాఫుల్. ఇక తప్ప ని సరి పరిస్థితుల్లో టాప్‌పైన 80 మందికి పైగానే ఎక్కుతారు. విద్యార్థులతో పాటు ప్రజలు కూడా ఉంటారు. అధికారులు ఆ సమయంలో మరో బస్సు పెడితే సరిపోతుంది. 
- బీ -నాగేష్, కండెక్టర్
 
 చేయి పట్టు తప్పితే..
 బస్సుపై కూర్చువడానికి కూడా స్థలం ఉం డదు. ఉన్నత చదువు లు చది వించాలన్న మా తల్లిదండ్రుల ఆశ అధికారుల నిర్లక్ష్యం వల్ల నెరవేరకుం డానే ప్ర మాదంలో ప్రాణాలు పోతాయేమోనన్న భయం వేస్తుంది. ఆర్‌టీసీ అధికారులు ఎప్పుడైనా ఈ రూట్‌లో పరిశీలించారా..
- దినేష్, విద్యార్థి, కల్లూరు
 
 రోజూ టాప్‌పై ప్రయాణమే...
 రోజూ వెదురూరు-రాజుపాళెం, నక్కలదిన్నె తదితర గ్రా మాల నుంచి వచ్చే వి ద్యార్థుల మం తా టాప్‌పైన ప్రయాణించాల్సిందే. భ యమేసినా కళాశాలకు సమయానికి వెళ్లాలి కదా. ఆర్‌టీసీ కళాశాలల స మయంలో అదనపు బస్సులు నడపాలి.
 -అనిల్‌కుమార్, నక్కలదిన్నె

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement