గ్రూప్స్‌కు చేయూత | support in group exams | Sakshi
Sakshi News home page

గ్రూప్స్‌కు చేయూత

Published Fri, Aug 5 2016 11:22 PM | Last Updated on Mon, Sep 4 2017 7:59 AM

గ్రూప్స్‌కు చేయూత

గ్రూప్స్‌కు చేయూత

 
  • ఉచితంగా శిక్షణ
  • శిక్షకులుగా ఉద్యోగులు
  • హిందూ రీడింగ్‌ రూం కమిటీ, ఆల్‌ ఇండియా  సంఘ మిత్ర స్పోర్ట్స్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో.
 నగరంలోని పలు కోచింగ్‌ సెంటర్లు గ్రూప్‌లకు శిక్షణ ఇస్తూ వేలాది రూపాయలు వసూలు చేస్తున్న తరుణంలో  విశాఖ పాతనగరంలోని హిందూ రీడింగ్‌ రూం కమిటీ, ఆల్‌ ఇండియా  సంఘ మిత్ర స్పోర్ట్స్‌ ఫౌండేషన్లు సంయుక్తంగా యువతకు ఉచితంగా వివిధ పోటీ పరీక్షలకు శి„ý ణ ఇస్తున్నాయి. గడిచిన ఆరు నెలలుగా గ్రూప్‌ 1, 2, 3, 4 పోటీ పరీక్షలతో పాటు ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచితంగా శి„ý ణ పోటీ పరీక్షలకు అవసరమైన స్టడీ మెటీరియల్‌ను ఉచితంగా అందిస్తున్నారు. ఇక్కడ శిక్షణ పొందుతున్న విద్యార్థుల్లో డి.నంద, శ్రీకాంత్‌ అనే యువకులకు ఉద్యోగాలు లభించాయి. ఇక్కడ  శిక్షణ పొందేందుకు దూర ప్రాంతాల వారు సైతం ముందుకు వస్తున్నారు. ఈ శిక్షణా శిబిరంలో కమర్షియల్‌ టాక్స్‌ శాఖతో పాటు ఇతర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు,  లాభాపేక్ష లేకుండా ఉచితంగానే శిక్షణ ఇస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ వివిధ సబ్జెక్టులలో శిక్షణ కొనసాగుతుంది. అనంతరం సాయంత్రం 6 గంటల వరకూ రీడింగ్‌ రూంలోని లైబ్రరీలో ఏర్పాటు చేసిన పోటీ పరీక్షల పుస్తకాలను చదువుకొంటూ, నోట్స్‌లను తయారు చేసుకుంటూ విద్యార్థులు పూర్తి స్థాయిలో పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్నారు. పదిహేను మంది విద్యార్థులతో ప్రారంభమైన శిక్షణ నేడు 80 విద్యార్థులకు చేరుకుంది.
–పాతపోస్టాఫీసు 
 
లాభాపేక్ష లేకుండా ఉచిత శిక్షణ
కమర్షియల్‌ టాక్స్‌ అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎటువంటి రుసుం తీసుకోకుండానే పోటీ పరీక్షలకు అవసరమైన శిక్షణను విద్యార్థులకు అందిస్తున్నారు.
శ్రీనివాసరావు (డీసీటీవో)–ఆధునిక చరిత్ర
డి.రాంబాబు (డీసీటీవో–అనకాపల్లి)–చరిత్ర, కరెంట్‌ ఎఫైర్స్‌
సిహెచ్‌.గోవిందు (జూనియర్‌ అసిస్టెంట్‌ కమర్షియల్‌ టాక్స్‌)–మెంటల్‌ ఎబిలిటీ
యల్లాజీరావు(లేబర్‌ ఆఫీసర్‌–విజయనగరం)–జనరల్‌ సైన్స్‌
దేముడుబాబు (ఉపాధ్యాయుడు–పెందుర్తి)–జాగ్రఫీ
వీరితో పాటు మరికొందరు ఉచితంగా శిక్షణ అందిస్తున్నారు.
 
విద్యార్థులకు మంచి భవిష్యత్తు కల్పించడమే లక్ష్యం
విద్యార్థులకు మంచి భవిష్యత్తును కల్పించడమే లక్ష్యంగా గ్రూప్స్‌తో పాటు అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నాం. శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన సిద్దార్థ స్టడీ సర్కిల్‌ ద్వారా ఉచిత శిక్షణ పొందినవారిలో సుమారు 150 మంది ప్రభుత్వ ఉద్యోగాలు దక్కించుకున్నారు. సివిల్స్‌పై యువతలో ఉన్న అపోహలు తొలగించి కుల, మత, వర్గ బేధాలు లేకుండా ఎవరైనా శిక్షణ పొంది మంచి ఉద్యోగాన్ని పొందవచ్చని నిరూపించడమే ధ్యేయంగా శిక్షణ ఇస్తున్నాం.
–తమ్మిరెడ్డి శివశంకర్,డిప్యూటీ కమర్షియల్‌ టాక్స్‌ కమిషనర్‌–విశాఖపట్నం
 
విద్యార్థులకు అన్ని సదుపాయాలు కల్పించాం
శిక్షణార్థం వస్తున్న విద్యార్థులందరికీ సొంత నిధులతో ఉచితంగా ఇంటర్‌నెట్, వైఫై సౌకర్యాలతో పాటు స్టడీ మెటీరియల్‌ను అందిస్తున్నాం. దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థినులకు ఎన్‌ఏడీ కొత్తరోడ్డులో ఉన్న బొత్స స్క్వేర్‌లో ఉచిత వసతిని కల్పించాం. ఈ ఉచిత శిక్షణ ఎల్లకాలం కొనసాగుతుందని గర్వంగా చెప్పగలుగుతున్నాం. శిక్షణ పొందాలనుకున్న విద్యార్థులు 94403 95763, 88852, 83225 నంబర్ల ద్వారా సంప్రదించవచ్చు.
–పాండ్రంగి రుక్మాకరరావు–ఆల్‌ ఇండియా సంఘమిత్ర స్పోర్ట్స్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు
 
సివిల్స్‌ సాధించడమే లక్ష్యం
రీడింగ్‌ రూంలో ఉచితంగా వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తున్నారని తెలుసుకుని వచ్చి గ్రూప్స్‌నకు శిక్షణ పొందుతున్నాను. శిక్షణతో పాటు స్టడీ మెటీరియల్‌ను కూడా ఉచితంగా అందించారు. లైబ్రరీలోని పుస్తకాలను చదువుకొంటూ నోట్స్‌ ప్రిపేర్‌ చేసుకుంటున్నాను.
–బి.కష్ణవేణి–అలమండ
 
మంచి శిక్షణ ఇస్తున్నారు
వేలాది రూపాయల ఖర్చయ్యే గ్రూప్స్‌ శిక్షణను ఉచితంగా అందించడం ఆనందంగా ఉంది. నాన్న చనిపోయిన తరువాత అమ్మ టైలరింగ్‌ చేస్తూ నన్ను చదివించింది. అమ్మ రుణం తీర్చుకోడానికైనా గ్రూప్స్‌లో విజయం సాధిస్తాను. ఇక్కడకు రాకముందు బ్యాంకులకు సంబంధించిన పరీక్షలు రాశాను. ఇక్కడకు వచ్చిన తరువాత గ్రూప్స్‌ ఎలాఅయినా పాస్‌ కావాలని గట్టిగా నిర్ణయించుకున్నాను.
–మీసాల భానుశ్రీ,విశాఖపట్నం
 
శివశంకర్‌ మాస్టారే స్ఫూర్తి
నాన్న కూలీపని చేసి నన్ను డిగ్రీ వరకూ చదివించారు. ఒకసారి శివశంకర్‌ మా ఊళ్లో చిన్న సమావేశం ఏర్పాటు చేసి గ్రూప్స్‌ గురించి తెలియజేయడంతో పాటు విశాఖపట్నం రీడింగ్‌ రూంలో ఇస్తున్న ఉచిత శిక్షణ గురించి తెలియజేయడంతో ఇక్కడకు వచ్చి శిక్షణ పొందుతున్నాను. ఆయనే చెప్పకుండా ఉంటే ఈ శిక్షణ శిబిరం గురించి తెలిసేదికాదు.
ఎం.తిరుపతిరావు,గుడ్డిప గ్రామం,రావికమతం మండలం
 
సివిల్స్‌లో విజయం సాధిస్తాను
శివశంకర్‌ ఇచ్చిన స్ఫూర్తితో గ్రూప్‌ 1లో విజయం సాధించాలన్న పట్టుదలతో శిక్షణ పొందుతున్నాను. గతంలో పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకున్నా.. ఇక్కడ ఇస్తున్న శిక్షణ ఎంతో మెరుగ్గా ఉంది. నాలాంటి వారికి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంది.
పి.సురేష్‌–విశాఖపట్నం
 
ఉద్యోగం సాధించాను
ఇంజినీరింగ్‌ విభాగంలో ఉన్న నేను వివిధ పోటీ పరీక్షలకు ఇతర కోచింగ్‌ సెంటర్లద్వారా వెళ్లినా ఫలితం దక్కలేదు. శివశంకర్‌ స్ఫూర్తితో గత ఆరు నెలలుగా ఇక్కడే శిక్షణ పొందాను. ప్రస్తుతం కువైట్‌లోని ఓ ప్రైవేటు కంపెనీ పెట్టిన పరీక్షల్లో విజయం సాధించి ఉద్యోగం సంపాదించుకున్నాను. దినసరి కూలీగా పనిచేసి నా భవిష్యత్తు గురించి కలలు నా తండ్రి కలలు నెరవేర్చాను.
శ్రీకాంత్‌–విశాఖపట్నం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement