రెవెన్యూ ఉద్యోగులకు సర్వే పరీక్ష
Published Sun, Jan 22 2017 11:34 PM | Last Updated on Tue, Sep 5 2017 1:51 AM
కర్నూలు(అగ్రికల్చర్): రెవెన్యూ శాఖ సీనియర్ అసిస్టెంట్లకు ఆదివారం ఉదయం సర్వే పరీక్ష నిర్వహించారు. కలెక్టరేట్ భూమి రికార్డులు, సర్వే విభాగం కార్యాలయంలో సర్వే మెయిన్‌టెనెన్స్ టెస్ట్ పరీక్ష జరిగింది. పరీక్ష నిర్వహణకు జిల్లా ఉపాధి కల్పన సంస్థ అధికారి ప్రతాప్‌రెడ్డి చీఫ్ సూపరింటెండెంటుగా వ్యవహరించారు. రెవెన్యూ ఉద్యోగులు పదోన్నతులు పొందాలంటే విధిగా సర్వే టెస్ట్ పాస్ కావాల్సి ఉంది. సర్వే పరీక్షకు 22 మందికిగాను 20 మంది హాజరయ్యారు. పరీక్షలో చూచిరాతలు జరిగినట్లు సమాచారం.
Advertisement
Advertisement