మృతుడు సోమశేఖర్
పూతలపట్టు: మండలంలోని కొర్లమిట్ట గ్రామానికి చెందిన బీఎస్ఎఫ్ జవాన్ ఢిల్లీలో తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. కొర్లమిట్ట గ్రామానికి చెందిన భాస్కర్ కొడుకు సోమశేఖర్(31) బీఎస్ఎఫ్లో 2002లో చేరారు. ప్రస్తుతం ఢిల్లీలోని బీఎస్ఎఫ్ బ్లాక్ కమెండోలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని సోమవారం సాయంత్రం కొర్లమిట్టకు బీఎస్ఎఫ్ అధికారులు తీసుకొచ్చారు. మృతునికి భార్య, కొడుకు, కుమార్తె ఉన్నారు. సోమశేఖర్ మృతికి కుటుంబ కలహాలే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. సోమశేఖర్‌కు మంగళవారం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బీఎస్ఎఫ్ సిబ్బంది తెలిపారు.