BSF javan
-
భారత్ విజయం.. పాక్ నుంచి BSF జవాన్ విడుదల
సాక్షి, ఢిల్లీ: పాకిస్తాన్‌పై దౌత్యం విషయంలో భారత్ విజయం సాధించింది. ఎట్టకేలకు భారత బీఎస్ఎఫ్ జవాన్ పీకే షాను పాకిస్తాన్ విడుదల చేసింది. 20 రోజుల తర్వాత భారత జవాన్‌ను పాకిస్తాన్ విడిచిపెట్టింది. దీంతో, సదరు జవాన్ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వివరాల ప్రకారం.. బీఎస్ఎఫ్కు చెందిన భారత జవాన్ పూర్ణం కుమార్ షా అనుకోకుండా పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించారు. దీంతో, పీకే షాన్ పాక్ రేంజర్లు అదుపులోకి తీసుకున్నారు. ఏప్రిల్ 23వ తేదీన ఈ ఘటన చోటుచేసుకుంది. అనంతరం, దౌత్యపరంగా భారత్.. పాకిస్తాన్‌పై ఒత్తిడి తెచ్చింది. దీంతో, 20 రోజుల తర్వాత పీకే షాను.. ఈరోజు పాకిస్తాన్ విడుదల చేసింది. ఈ క్రమంలో బుధవారం ఉదయం అటారీ సరిహద్దుల వద్ద జవాన్‌ను భారత్‌కు అప్పగించింది. Today BSF Jawan Purnam Kumar Shaw, who had been in the custody of Pakistan Rangers since 23 April 2025, was handed over to India: BSF(Pic Source: BSF) pic.twitter.com/TVzagO0AhK— ANI (@ANI) May 14, 2025182 బీఎస్ఎఫ్ బెటాలియన్‌కు చెందిన షా పశ్చిమ బెంగాల్ వాసి. పంజాబ్‌లోని ఫిరోజ్పూర్లో ఇండో-పాక్ సరిహద్దు వద్ద ఆయన కొంతమంది రైతులతో కలిసి అనుకోకుండా భారత సరిహద్దును దాటి పాక్ ప్రాంతంలోకి అడుగుపెట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. సైనికుడిని విడిపించడానికి భారత ఆర్మీ అధికారులు పాకిస్తాన్ రేంజర్లతో చర్చలు జరిపారు. ఇలాంటి సంఘటలు అసాధారణం కాదని, గతంలో కూడా ఇలాంటివి జరిగాయని అధికారులు పేర్కొన్నారు. పౌరులు కానీ, జవాన్లు కానీ ఇలా అనుకోకుండా ఆవలి దేశ సరిహద్దులోకి వెళ్లిన సందర్భాల్లో ఇరుదేశాల అధికారులు మిలిటరీ ప్రొటోకాల్ ప్రకారం ఫ్లాగ్ మీటింగ్‌ల ద్వారా సమస్యను పరిష్కరించుకుంటారు. అయితే, పహల్గాం ఉదంతం తర్వాత పాకిస్తాన్‌పై భారత్ ఆంక్షలు విధించిన క్రమంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. పాక్ రేంజర్లకు పట్టు బడిన సమయంలో సాహు యూనిఫాంలో ఉన్నారని, అతని వద్ద సర్వీస్ రైఫిల్ కూడా ఉన్నట్టు అధికారులు చెప్పారు. -
అమిత్ షా టూర్ వేళ అపశృతి..పేలుడులో జవాన్‌కు గాయాలు
రాయ్‌పూర్:కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం(డిసెంబర్15) ఛత్తీస్‌గఢ్ పర్యటన సందర్భంగా అపశృతి దొర్లింది. షా పర్యటనను పురస్కరించుకుని ఛత్తీస్‌గఢ్ కాంకేర్‌లో భద్రతా సిబ్బంది ముందస్తు తనిఖీలు చేపట్టారు.ఈ తనిఖీల్లో మావోయిస్టులు అమర్చిన ఐఈడీని భద్రతా సిబ్బంది గుర్తించారు. ఐఈడీని నిర్వీర్యం చేసే సమయంలో అది ఒక్కసారిగా పేలడంతో భద్రతా సిబ్బంది ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.దీంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. తర్వాత భద్రతా సిబ్బంది ఆ ప్రాంతంలో విస్త్రృత సోదాలు నిర్వహించారు. పేలుడు పదార్థాలతో తిరుగుతున్న తొమ్మిది మంది మావోయిస్టులను అరెస్టు చేశారు. అమిత్ షా పర్యటన వేళ ఈ ఘటన చోటుచేసుకోవడంతో కాంకేర్‌లో హై అలర్ట్ ప్రకటించారు.ఈ ప్రాంతంలో భద్రతా దళాలను భారీగా మోహరించినట్లు కాంకేర్ జిల్లా ఎస్పీ తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లో రెండు రోజుల పర్యటన నిమిత్తం కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం రాయ్‌పుర్ చేరుకున్నారు. రాయ్‌పూర్,బస్తర్ జిల్లాల్లో జరిగే పలు కార్యక్రమాలకు ఆయన హాజరవుతారు. -
Chakrapani Nagari: పాటల తుపాకీ...
దేశ సరిహద్దులో బీఎస్ఎఫ్ జవాన్. వేదికల మీద పాటలు పాడుతూ తనలో ఉన్న కళకు హద్దులు లేవని నిరూపిస్తున్నారు. ‘డ్యూటీలో ఉంటూ గాన సాధన కూడా చేయడంతో ఈ పాట నాకు బాగా వంటపట్టింది’ అంటూ ఇటీవల హైదరాబాద్ వచ్చిన చక్రపాణి నగరి తన గురించి వివరించారు. ‘‘మాది శ్రీకాకుళం జిల్లా, పలాస. టెన్త్‌క్లాస్ వరకు హైదరాబాద్ హాస్టల్లో ఉండి చదువుకున్నాను. ఆ సమయంలో బీఎస్ఎఫ్కు సంబంధించిన ఒక ప్రకటన చూసి, అప్లై చేశాను. ఆ పరీక్షల్లో సెలక్ట్ అయ్యి 2013లో బీఎస్ఎఫ్లో చేరాను. ఇప్పటి వరకు రాజస్థాన్‌లో పని చేశాను. ఇప్పుడు సెలవు మీద హైదరాబాద్‌కు వచ్చాను. సెలవు పూర్తవగానే జమ్ములో విధులు నిర్వర్తించాలి. డ్యూటీలో ఉంటూ.. ఏదో ఒకటి పాడుకుంటూ ఉండటం అనేది స్కూల్ టైమ్ నుంచే ఉండేది. కానీ, ఎప్పుడూ దానిని నా డ్రీమ్ ప్రాజెక్ట్ అనుకోలేదు. బీఎస్ఎఫ్లో చేరిన తర్వాత అక్కడ మా టీమ్, క్యాంపుల్లో సరదాగా పాడుతుండేవాడిని. నెలకు ఒకసారి ఏదో ఒక సెలబ్రేషన్ ప్రోగ్రామ్ జరుగుతుంటుంది. ఆ సమయంలో అన్నీ హిందీ పాటలు పాడేవాడిని. అక్కడున్నవారందరికీ హిందీ తెలుసు కాబట్టి, అవే పాటలు పాడేవాడిని. మా తోటి జవాన్లే కాదు ఆఫీసర్స్ కూడా చాలా ప్రోత్సహించేవారు. డ్యూటీలో ఉన్నా లేకున్నా పాటలు పాడటం మాత్రం ఆగేది కాదు. ఇక మా ఊరికి వచ్చినప్పడు పెళ్లిళ్లు వంటి వేడుకల సందర్భాల్లోనూ నా గాన కచేరీ ఉండేది. ఖాళీ సమయంలో డిజిటల్ మీడియాని ఫాలో అవుతుంటాను. అలా, హైదరాబాద్‌లోని ఓ టీవీ పాటల కార్యక్రమంలో పాల్గొనవచ్చు అని ప్రకటన చూసి, అప్లై చేసుకున్నాను. వేల మందిలో నాకు అవకాశం రావడంతో చాలా సంతోషంగా అనిపించింది. ఈ విషయాన్ని మా అధికారులకు చెబితే వాళ్లూ వెంటనే ఓకే చేశారు. ఇక్కడ కార్యక్రమంలో పాల్గొనడమే కాదు, గాన గంధర్వుడు బాలుగారి మైక్‌ను కానుకగా అందుకోవడం చాలా ఆనందాన్నిచ్చింది. కష్టపడుతూ.. మా అమ్మానాన్నలకు మేం ముగ్గురం. నా చిన్నప్పుడే నాన్న చనిపోవడంతో మా అమ్మ చాలా కష్టాలు పడింది. మమ్మల్ని హాస్టల్లో ఉంచి, తెలిసినవారి ద్వారా ఢిల్లీ వెళ్లి, పనులు చేసి, మాకు డబ్బు పంపేది. ఇప్పుడు అమ్మ ఊళ్లో వ్యవసాయం పనులు చేస్తుంది. అన్నయ్య సొంతగా బేకరీ నడిపిస్తున్నాడు. అక్క గ్రామవాలంటీర్గా చేస్తోంది. మాకు కష్టం విలువ తెలుసు, స్వయంగా ఎదగడానికి మా వంతుగా కృషి చేస్తూనే వచ్చాం. ఆ కష్టంలో నుంచే ఈ పాట పుట్టుకు వచ్చిందనుకుంటాను. ఎక్కడ ఉన్నా కళ రాణిస్తుందనడానికి నేనే ఉదాహరణ అనిపిస్తుంటుంది. మరిన్ని కార్యక్రమాల్లో పాల్గొని సింగర్‌గా రాణించాలనుకుంటున్నాను’’ అని తెలియజేశాడు ఈ జవాన్. – నిర్మలారెడ్డి -
నాపై నిఘా పెట్టారు.. భద్రత అక్కర్లేదు: టీఎంసీ ఎంపీ
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై నిఘా పెట్టారని ఆరోపించారు. ఈ క్రమంలో ఆమె ఢిల్లీ పోలీసులకు లేఖ రాశారు. తనకు భద్రత కావాలని కోరలేదని.. కానీ తన నివాసం వద్ద బీఎస్ఎఫ్ జవాన్లను మోహరించారని వెల్లడించారు. ఇంత సడెన్‌గా తన ఇంటి వద్ద బీఎస్ఎఫ్ అధికారులను నియమించడం పట్ల ఆమె ఆందోళన వ్యక్తంచేశారు. తక్షణమే వారిని ఉపసంహరించుకోవాలని ఢిల్లీ పోలీసులకు రాసిన లేఖలో తెలిపారు. సాధారణ పౌరురాలిగా ఉండాలని కోరకుంటున్నాను. నాకు ఎలాంటి భద్రత వద్దన్నారు మహువా. ఇక బీఎస్ఎఫ్ కదలికలు చూస్తుంటే తనపై నిఘా ఉంచినట్టు అనిపిస్తోందంటూ ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఎన్ఎన్ శ్రీవాస్తవకు రాసిన లేఖలో పేర్కొన్నారు మహువా మొయిత్రా. శుక్రవారం సాయంత్రం 4.30గంటల సమయంలో తన అధికారిక నివాసానికి ఎస్‌హెచ్‌వో వచ్చారనీ.. ఆ తర్వాత రాత్రి 10గంటల సమయంలో ముగ్గురు బీఎస్ఎఫ్ అధికారులను ఇంటి బయట ఉంచినట్టు లేఖలో తెలిపారు. తన భద్రత కోసమే వచ్చినట్టు జవాన్లు చెబుతున్నారని పేర్కొన్నారు. 3 BSF men w/ assault rifles outside my home. Say they are from Barakhamba Road police station for my “protection”. Still outside my home. Am a free citizen of India - people will protect me. Request Honb’le HM @AmitShah Ji & @HMOIndia to remove immediately pic.twitter.com/7nQLy323Xv — Mahua Moitra (@MahuaMoitra) February 13, 2021 ఈ దేశ సాధారణ పౌరురాలిగా ఉండాలనుకుంటున్నానన్న మహువా.. తనకు భద్రత కావాలని ఎవరినీ అడగలేదన్నారు. తన ఇంటి వద్ద ఉన్న జవాన్లను తక్షణమే ఉపసంహరించుకోవాలని పోలీసులను కోరారు. ఈ లేఖను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. తనను కాపాడేందుకే ప్రజా ధనాన్ని వృథా చేయొద్దని సూచించారు. అందరికీ రక్షణ కల్పించాలి తప్ప తనకేమీ ప్రత్యేకంగా అవసరం లేదన్నారు మహువా. తనపై నిఘా పెట్టాలంటే తనను అడగాలని, తానే చెబుతానని తెలిపారు. మహువా బెంగాల్‌లోని కృష్ణానగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. 3 BSF men w/ assault rifles outside my home. Say they are from Barakhamba Road police station for my “protection”. Still outside my home. Am a free citizen of India - people will protect me. Request Honb’le HM @AmitShah Ji & @HMOIndia to remove immediately pic.twitter.com/7nQLy323Xv — Mahua Moitra (@MahuaMoitra) February 13, 2021 -
మాజీ జవాన్ నామినేషన్ తిరస్కరణ
వారణాసి: వారణాసి లోక్‌సభ నియోజకవర్గంలో ప్రధాని నరేంద్ర మోదీపై సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ బీఎస్ఎఫ్ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ నామినేషన్‌ను ఎన్నికల సంఘం తిరస్కరించింది. భద్రతాబలగాలకు పెట్టే ఆహార నాణ్యతపై ఫిర్యాదు చేస్తూ ఆన్లైన్లో వీడియో పెట్టడంతో 2017లో తేజ్ బహదూర్‌ను విధుల నుంచి తొలగించారు. ఆయన సమర్పించిన రెండు జతల నామినేషన్ పత్రాల్లో తేడాలున్నట్లు గుర్తించిన వారణాసి రిటర్నింగ్ అధికారి వాటిని తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. తనను ఎన్నికల్లో పోటీ చేయకూడదనే బీజేపీ అడ్డుకుంటోందని ఆరోపించారు. -
బీఎస్ఎఫ్ జవాన్ ఆత్మహత్య
పూతలపట్టు: మండలంలోని కొర్లమిట్ట గ్రామానికి చెందిన బీఎస్ఎఫ్ జవాన్ ఢిల్లీలో తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. కొర్లమిట్ట గ్రామానికి చెందిన భాస్కర్ కొడుకు సోమశేఖర్(31) బీఎస్ఎఫ్లో 2002లో చేరారు. ప్రస్తుతం ఢిల్లీలోని బీఎస్ఎఫ్ బ్లాక్ కమెండోలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని సోమవారం సాయంత్రం కొర్లమిట్టకు బీఎస్ఎఫ్ అధికారులు తీసుకొచ్చారు. మృతునికి భార్య, కొడుకు, కుమార్తె ఉన్నారు. సోమశేఖర్ మృతికి కుటుంబ కలహాలే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. సోమశేఖర్‌కు మంగళవారం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బీఎస్ఎఫ్ సిబ్బంది తెలిపారు. -
బీఎస్ఎఫ్ జవాన్‌కు కన్నీటి వీడ్కోలు
మధిర: బీఎస్ఎఫ్ జవాన్ చింతల అంజయ్య(38) మృతదేహం స్వగ్రామమైన మధిర మండలంలోని నక్కలగరుబుకు శనివారం చేరుకుంది. ఈ నెల 12వ తేదీ తెల్లవారుజామున ఢిల్లీలో విధి నిర్వహణలో ఉండగా గుండెపోటుతో ఆయన మృతిచెందారు. అంజయ్య 18 సంవత్సరాలుగా ఆర్మీలో పనిచేస్తున్నారు. ఆయన ఇటీవలే జమ్మూకాశ్మీర్ నుంచి ఉద్యోగోన్నతిపై ఢిల్లీకి వచ్చారు. మృతదేహాన్ని ఢిల్లీ నుంచి బెంగుళూరుకు విమానంలో, అక్కడి నుంచి ఆర్మీ బస్సులో (ఆర్మీ) సిబ్బంది శనివారం నక్కలగరుబు తీసుకొచ్చారు. అంజయ్యకు భార్య, కుమారుడు ప్రణీత్, కుమార్తె సౌజన్య ఉన్నారు. మృతదేహాన్ని మధిర టౌన్ ఎస్ఐ గూడ అశోక్‌రెడ్డి, పోలీసు సిబ్బంది సందర్శించి నివాళులర్పించారు. అంత్యక్రియల సమయంలో సైనిక సిబ్బంది గాలిలోకి కాల్పులు జరిపి నివాళులర్పించారు. నక్కలగరుబులో విషాదం అంజయ్య మృతితో ఆయన స్వగ్రామం నక్కలగరుబులో విషాదం నెలకొంది. స్థానికులతోపాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చి మృతదేహాన్ని సందర్శించారు. తమ గ్రామంలోని వారితోపాటు చుట్టుపక్కల గ్రామాల్లోని అందరికీ అంజయ్య సుపరిచితుడని స్థానికులు చెప్పారు. నాయకుల సంతాపం అంజయ్య మృతదేహాన్ని వైఎస్ఆర్ సీపీ మధిర మండల అధ్యక్షుడు యన్నం కోటేశ్వరరావు, ఆత్కూరు ఎంపీటీసీ సభ్యురాలు యన్నం రజిని, సీపీఎం నాయకుడు లింగాల కమల్‌రాజ్, రైతు సంఘం నాయకుడు చిత్తారు నాగేశ్వరరావు తదితరులు సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. ఆయన కుటుంబీకులకు సానుభూతి తెలిపారు.