మార్కెట్ కమిటీపై వీడిన సస్పెన్స్
Published Sat, Aug 27 2016 11:18 PM | Last Updated on Fri, Aug 17 2018 5:24 PM
కరీంనగర్‌అగ్రికల్చర్: కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిపై నాలుగు నెలల సస్పెన్స్ వీడింది. తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ ఎంపీటీసీ సబ్యుడు గోగూరి నర్సింహారెడ్డిని కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్‌గా నియమిస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ పార్థసారది ఉత్తర్వులు జారీ చేసారు. చైర్మన్, వైస్ చైర్మన్‌తో పాటు మరో 8 మంది డైరెక్టర్లు, అందులో ఇద్దరు ట్రేడర్లు, ఒకరు సింగిల్‌విండో చైర్మన్‌లుండగా మరో ముగ్గురు ఎక్స్ అఫిషియో సభ్యుల పాలకవర్గ కమిటీని ఏడాది కాలం పాటు నియమించారు. వైస్ చైర్మన్‌గా జువ్వాడి రాజేశ్వర్‌రావు(ఇరుకుల్ల), డైరెక్టర్లుగా నాయక్ పాషా(నగునూర్), దామెరపల్లి అంజిరెడ్డి(ముగ్దుంపూర్), తిప్పర్తి లక్ష్మయ్య(చామనపల్లి), గుర్రాల చంద్రమౌళి(ఎలగందుల), గొర్రె రవీందర్(నాగుల మల్యాల), ఉప్పు మల్లేశం(బద్దిపల్లి), వ్యాపార వర్గాల ప్రతినిధులుగా విజయ్‌కుమార్ ముందడ, ఉప్పుల శ్రీధర్, సింగిల్ విండో చైర్మన్ ప్రతినిదిగా మంద రాజమల్లు (దుర్శేడ్ సింగిల్‌విండో చైర్మన్), ఎక్స్ అఫిషియో సభ్యులుగా నగర మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్, ఏడీ అగ్రికల్చర్ రణధీర్(ఇన్‌చార్జి), ఏడీ మార్కెటింగ్ పద్మావతిలను నియమించారు.
చైర్మన్ పదవి అనూహ్యం..
రిజర్వేషన్లలో భాగంగా కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి జనరల్‌కు కేటాయించారు. మార్కెట్‌పరిధిలోS కరీంనగర్‌తోపాటు తిమ్మాపూర్ మండలం ఉండటంతో రెండు మండలాలకు చెందిన నాయకులు చైర్మన్ పదవికోసం తీవ్రస్ధాయిలో ప్రయత్నించారు. ప్రధానంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కరీంనగర్ మండలానికి చెందిన అనుచరులకే చైర్మన్ పదవి కట్టబెట్టాలని పట్టుమీద ఉండడంతో కమిటీ నియామకంలోనూ ఆలస్యం జరిగిందని తెలిసింది.అనూహ్యంగా తిమ్మాపూర్ మండలం నుస్తులపూర్ ఎంపీటీసీ సభ్యుడు గోగూరి నర్సింహరెడ్డి పేరు తెరపైకి వచ్చింది. 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో, పార్టీలో చురుకుగా పాల్గొన్న నర్సింహరెడ్డికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రచారం సాగింది. అందుకు సీఎం కేసీఆర్ సైతం సానుకూలంగా స్పందించారనే వాదనలు వినిపించాయి. ఈ నేపథ్యంలో గంగుల అనుచరులు కరీంనగర్ మండలానికి చెందిన వారికే వూర్కెట్ కమిటీ చైర్మన్ పదవి కట్టబెట్టాలని పట్టుబట్టారు. పోటీలో చింతకుంట మాజీ సర్పంచు పిట్టల రవీందర్ పోటీ పడగా అనూహ్యంగా చైర్మన్ పదవి మానకొండూర్ నియోజకవర్గంలోని తిమ్మాపూర్‌కు దక్కడం చర్చనీయాంశంగా మారింది. మార్కెట్ కమిటీ కరీంనగర్‌లో ఉండడంతో కరీంనగర్ నియోజకవర్గానికి చెందిన వారికే చైర్మన్ పదవి ఉండాలని స్థానిక ఎమ్మెల్యే పట్టుబట్టగా అధిష్టానం గోగూరి నర్సింహారెడ్డికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వూర్కెటింగ్ శాఖ మంత్రి హరీష్‌రావు, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ జోక్యంతో చివరి ఆఖరికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అనుమతితో గోగూరి నర్సింహారెడ్డినే చైర్మన్ పదవి వరించగా మిగిలిన డైరెక్టర్లంతా కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించినవారినే ఎన్నుకున్నారు.
Advertisement