ప్రజల అభ్యున్నతికి అండగా సిండికేట్‌ బ్యాంక్‌ | syndicate bank 71st anniversary | Sakshi
Sakshi News home page

ప్రజల అభ్యున్నతికి అండగా సిండికేట్‌ బ్యాంక్‌

Published Wed, Nov 2 2016 10:42 PM | Last Updated on Mon, Sep 4 2017 6:59 PM

ప్రజల అభ్యున్నతికి అండగా సిండికేట్‌ బ్యాంక్‌

ప్రజల అభ్యున్నతికి అండగా సిండికేట్‌ బ్యాంక్‌

విజయవాడ (వన్‌టౌన్‌) : సిండికేట్‌ బ్యాంక్‌ ప్రజల అభ్యున్నతికి సుదీర్ఘకాలంగా అండగా నిలిచిందని ఆ బ్యాంక్‌ విజయవాడ రీజియన్‌ అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ మహంతి అన్నారు. సిండికేట్‌ బ్యాంక్‌ విజయవాడ ప్రధాన శాఖ 71వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని బ్యాంక్‌ ఆవరణలో బుధవారం వినియోగదారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహంతి మాట్లాడుతూ బ్యాంక్‌ ద్వారా అన్ని వర్గాలకు, వారి అర్హతలను బట్టి అవసరమైన రుణాలు అందిస్తున్నామన్నారు. సిబ్బంది చిత్తశుద్ధి, వినియోగదారుల అండదండలే తమ బ్యాంక్‌ ఉన్నతికి కారణమన్నారు. బ్యాంక్‌ శాఖ మేనేజర్‌ జె.కనకారావు మాట్లాడుతూ వన్‌టౌన్‌లోని ప్రధాన శాఖ రూ.వందకోట్ల టర్నోవర్‌ మైలురాయిని దాటిందన్నారు. శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఏఈవో సీహె^Œ lప్రసాదరావు మాట్లాడుతూ బ్యాంక్‌ అభివృద్ధికి ఆలయం పక్షాన అండగా ఉంటామన్నారు. అనంతరం సీనియర్‌ ఖాతాదారులను, డిపాజిట్‌దారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ ఖాతాదారులు జేవీఎస్‌ రెడ్డి, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement