న్యూఢిల్లీ: బ్యాంకింగ్ సేవలను మరింత మెరుగుపరచాలని ఆర్థికశాఖ సహాయ మంత్రి భగవత్ కే కరాద్ బ్యాంకులకు విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగా బ్యాంకులు తమ ఖాతాదారులను దేవుడిలా చూడాలని కోరారు. బ్యాంకులు కస్టమర్లకు వచ్చే ఇబ్బందులు తగ్గించడంపై పూర్తి దృష్టి పెట్టాలని అన్నారు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓఎం) నిర్వహించిన కస్టమర్ మీట్ కార్యక్రమంలో కరాద్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
అదే విధంగా బ్యాంకులు పటిష్టంగా ఉండడానికి కస్టమర్లూ పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఇందులో భాగంగా రుణాల చెల్లింపులో వారు పూర్తి క్రమశిక్షణను పాటించాలని విజ్ఞప్తి చేశారు. కిసాన్ క్రెడిట్ కార్డ్ (కేసీసీ) స్కీమ్‌ను మరింత మంది రైతులకు విస్తరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. డిజిటలైజేషన్‌పై తమ బ్యాంక్ అత్యధిక దృష్టి సారిస్తున్నట్లు కార్యక్రమంలో పాల్గొన్న బీఓఎం మేనేజింగ్ డైరెక్టర్ ఏఎస్ రాజీవ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment