చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో సైకోలు హల్‌చల్ చేశారు. స్థానిక ఎన్టీఆర్ కాలనీలోని ఓ ఇళ్లలోకి ప్రవేశించిన దుండగులు నలుగురు మహిళలకు రక్త పరీక్షలు చేస్తామంటూ వచ్చి మత్తు మందు కలిపిన ఇంజక్షన్ చేశారు. వారు స్పృహ కోల్పోవటంతో అప్రమత్తమైన స్థానికులు దుండగుల్లో ఒకరిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఆపై పోలీసులకు అప్పగించారు. అతడు పొరుగునే ఉన్న కర్ణాటక రాష్ట్రం బంగారుపేటకు చెందిన వ్యక్తిగా తేలింది. బాధితులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పరారైన మరో వ్యక్తి కోసం గాలింపుచేపట్టారు.
కుప్పంలో సైకో సూదిగాళ్లు..!
Published Mon, Jun 27 2016 3:27 PM | Last Updated on Thu, May 10 2018 12:34 PM
Advertisement
Advertisement