
అన్న తరంగిణి
పాల్వంచ:
ఈ నెల 8 నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో జరిగే ఇండియా సెపక్ తక్రా క్యాంప్‌కు పాల్వంచకు చెందిన అన్న తరంగిణి ఎంపికైంది. శిక్షణ శిబిరానికి 12 మంది భారత సెపక్ తక్రా క్రీడాకారిణులను ఎంపిక చేశారు. వీరు అక్టోబర్ మాసంలో థాయ్‌లాండ్‌లో జరిగే వరల్డ్ చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొననున్నారు. తరంగిణి 5వ బీచ్ ఏషియన్ గేమ్స్‌కు ఎంపికైంది. సెపక్‌తక్రా అధ్యక్షుడు ప్రేమ్‌రాజ్, కోచ్ ధన్‌రాజ్, జాతీయ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ యోగిందర్‌సింగ్ దహియాలు ఆమెను అభినందించారు.