ఇంత పచ్చపాతమా..?
పాత శ్రీకాకుళం: తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై అధిష్టానం చూపిస్తున్న వల్లమాలిన ప్రేమ పల్లెల్లో అభాగ్యుల కడుపు కొడుతోంది. తాజాగా వన సేవకుల నియామకం విషయంలో ఈ విషయం మరోమారు తేట తెల్లమైంది.
నందిగాం మండలంలోని ఓ గ్రామంలో వన సేవకుని నియమించాల్సి ఉంది. అయితే ఈ ని యామకానికి నిబంధనలతో పని లేకుండా ఓ టీడీపీ కార్యకర్త భార్యకు పోస్టు కేటాయించారు. వారేమో విధులకు వెళ్లకుండానే అధికారులపై బ్లాక్ మెయిలింగ్ మొదలు పెట్టారు. దీంతో ఫారెస్ట్ రేంజ్ అధికారులు చేసేదేమీ లేక నోరు మెదపడం మానేశారు. ఇది ఒక్క నందిగాం మండలంలోనే కాదు. జిల్లాలో గల ఐదు రేంజ్ ఫారెస్టు పరిధుల్లోనూ జరుగుతున్న వ్యవహారం.
ఏంటీ పోస్టు..?
స్కూలు విద్యార్థుల అవగాహన కోసం ఫారెస్టు రేంజ్ పరిధిలో ఓ నర్సరీ ఏర్పాటు చేస్తున్నారు. అందులో గంగరావి, మహాగని, స్పేధోడియా, దేవకాంచన, ఎర్రతురాయి, పచ్చతురాయి, నిద్రగన్నేరు, వేప, నీలగిరి, టేకు, సరుగుడు తదితర పూల మొక్కలను పెంచుతారు. వీటి పెంపకానికి కేటాయించిన పోస్టే ఈ వన సేవకులు. వీరు నర్సరీలో మొక్కలు పెంపకంతో పాటు శానిటేషన్ పనులు చేయాలి.
ప్రభుత్వ సంస్థలకు, రైతులకు ఉచితంగా మొక్క లు ఇవ్వాలి. కానీ ఐదు రే ంజ్‌ల పరిధిలో అలా జరగడం లేదు. కొన్ని రేంజ్‌లలో ఇంకా నర్సరీలే ప్రారం భం కాలేదు. వన సేవకులు చేసే పనుల్లో లోపాలపై రేంజ్ అధికారులు ప్రశ్నిస్తే తమపైనే బ్లాక్‌మెయిలింగ్‌కు తిరగబడుతున్నారని ఓ రేంజ్ అధికారి తన ఆవేదన వెళ్లగక్కాడు.
కార్యకర్తలకే ప్రాధాన్యతా..?
* గడిచిన ఏడాది డిసెంబర్ నెలలో అటవీశాఖ ద్వారా నియమితులైన వన సేవకుల్లో సగం కంటే ఎక్కువ మంది టీడీపీ కార్యకర్తలు, వారి బంధువులే.
* జిల్లాలోని 23మండలాల్లో 56 పాఠశాలల్లో నర్సరీ ఏర్పాటు చేసేందుకు అటవీశాఖ శ్రీకారం చుట్టింది. అందులో కేవలం 43 పాఠశాలల్లోనే స్కూల్ నర్సరీ, వనసేవ కులను నియమించుకున్నారు. మిగిలిన 13 స్కూల్లో నర్సరీలను, వనసేవలకులను ఇంకా నియమించుకోవల్సి ఉంది.
పేరుకే మహిళలు...
వాస్తవంగా వన సేవకులుగా మహిళలనే ఎంపిక చేసుకోవాలి. అన్ని పనులను వారితోనే చేయాలి. కానీ అటవీ శాఖల్లో ఈ వ్యవహారమంతా విడ్డూరంగా కనిపిస్తోంది. మహిళల పేరు మీద బినామీలుగా పురుషులే సేవకుల అవతారమెత్తుతున్నారు. జీతభత్యాల విషయంలో మాత్రం మహిళల పేరుమీద నెలకు రూ.7,800 జమ చేస్తున్నట్లు రేంజ్ అధికారులు ఖాతాలు చూపిస్తున్నారు. ఆయా రేంజ్‌ల పరిధిలో గల టీడీపీ సర్పంచ్‌లే ఈ వ్యవహారమంతటికీ కారణమని వినిపిస్తోంది.
పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలి..
స్కూల్ నర్సరీ, వన సేవలకులపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాల్సి ఉంది. కొన్ని రేంజ్‌లలో ఇంకా నర్సరీ పనులు చేయాల్సి ఉంది. కొంతమంది వనసేవకులు రేంజ్ అధికారులపై బ్లాక్ మెయిల్ చేస్తున్న విషయం నా దృష్టికి రాలేదు. వర్షాలు పడే సమయం ఆసన్నమైంది. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తాం.
- లోహితాస్యుడు, జిల్లా ఫారెస్ట్ అధికారి