కారెక్కిన టీడీపీ కౌన్సిలర్లు | tdp councillors joins in trs in wanaparthy | Sakshi
Sakshi News home page

కారెక్కిన టీడీపీ కౌన్సిలర్లు

Published Mon, Apr 24 2017 10:50 PM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM

కారెక్కిన టీడీపీ కౌన్సిలర్లు - Sakshi

కారెక్కిన టీడీపీ కౌన్సిలర్లు

వనపర్తి : స్థానిక మున్సిపాలిటీలోని టీడీపీకి చెందిన 18, 26 వార్డుల కౌన్సిలర్లు ఖైరూన్‌బేగం, పుట్టపాకల పార్వతి సోమవారం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. సోమవారం స్థానిక 26వ వార్డులో ఏర్పాటు చేసిన సమావేశంలో నిరంజన్‌రెడ్డి కౌన్సిలర్లు, వారితో పాటు టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌కే వచ్చే కార్యకర్తలు, యూత్‌కు టీఆర్‌ఎస్‌ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. రానున్న సాధారణ ఎన్నికల్లో విజయం మనదే అన్న ధైర్యంతో కార్యకర్తలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌లో వస్తున్న వలసలను చూసి ఇప్పటికే ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు ముచ్చెమటలు పట్టాయన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ పలుస రమేష్‌గౌడ్, నాయకులు యోగానందరెడ్డి, విక్రం, శివ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement