'ఇప్పటికైనా సాక్షి ప్రసారాలను పునరుద్ధరించాలి' | TDP govt should be reviewed Sakshi tv news telecast in andhra | Sakshi
Sakshi News home page

'ఇప్పటికైనా సాక్షి ప్రసారాలను పునరుద్ధరించాలి'

Published Mon, Jun 13 2016 7:25 PM | Last Updated on Mon, Sep 4 2017 2:23 AM

'ఇప్పటికైనా సాక్షి ప్రసారాలను పునరుద్ధరించాలి'

'ఇప్పటికైనా సాక్షి ప్రసారాలను పునరుద్ధరించాలి'

విశాఖ/అలహాబాద్: ఇప్పటికైనా టీడీపీ ప్రభుత్వం సాక్షి ప్రసారాలను పునరుద్ధరించాలని ఏపీ బీజేపీ ప్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. సోమవారం అలహాబాద్ నుంచి మీడియాతో మాట్లాడిన ఆయన సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేతపై స్పందించారు. ఏపీ ప్రభుత్వం ప్రచార సాధనాలను నిలిపివేయడాన్ని ఆయన ఖండించారు. ఏదైనా ఇబ్బంది ఉంటే తగిన ఆధారాలతో చట్టపరంగా పరిష్కరించుకోవాలని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రచార సాధనాలను అడ్డుకోవడమనేది సముచితం కాదని విష్ణుకుమార్ రాజు హితవు పలికారు.

కాగా, సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేతను నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పెద్దఎత్తునా నిరసనజ్వాల వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. జర్నలిస్టు సంఘాల నాయకులు, ప్రజాస్వామ్య వాదులు, ప్రజాసంఘాల నేతలు మద్దతు తెలుపుతూ.. పలు జిల్లాలో భారీ ర్యాలీలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement