Woman Maoist
-
మహిళా మావోయిస్టు అరెస్టు
ఏటూరునాగారం: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన మహిళా మవోయిస్టును ములుగు జిల్లా ఏటూరునాగారం పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. స్థానిక సీఐ నాగబాబు దీనికి సంబంధించిన వివరాలు మీడియాకు తెలిపారు. ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి సిబ్బందితో ఏటూరునాగారంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా.. బస్టాండ వద్ద ఒక మహిళ అనుమానాస్పదంగా కనిపించడంతో తనిఖీ చేయగా ఆమె వద్ద ఉన్న సంచిలో పేలుడు పదార్థాలు, పేలుళ్లకు వాడే టిఫిన్ బాక్స్, వైర్లు, విప్లవ సాహిత్యం లభించిందని చెప్పారు. ఆమెను విచారించగా, తన పేరు హేమ్ల జయమతి, భర్త పేరు మడకం ఉంగ, ఛత్తీస్‌గఢ్‌లోని మరియుగొండి మండలం పుల్లుం గ్రామవాసిగా తెలిపిందని సీఐ నాగబాబు వెల్లడించారు. ఈ విషయాన్ని ఛత్తీస్‌గఢ్ పోలీసులకు తెలపగా.. ఆమె నేరచరిత్రపై వివరాలు పంపించారని చెప్పారు. మవోయిస్టు పార్టీలో ఆమె 14 ఏళ్ల నుంచి ఆమె పనిచేస్తోందని, 2017లో పామేడు ఏరియా కమిటీలో పనిచేసిన జయమతి పలు ఎన్కౌంటర్లలో పాల్గొని తప్పించుకుందని చెప్పారు. 2013 ఏప్రిల్, మే మధ్యకాలంలో చిన్నగల్లెం, బానిసగూడ పీఎస్ పరిధిలో పోలీసు పార్టీని చంపడానికి జరిపిన కాల్పుల్లో కీలక పాత్ర పోషించినట్టు తెలిపారు. తాజాగా పామేడు కమిటీ సెక్రటరీ మనీల ఆదేశాల మేరకు ఛత్తీస్‌గఢ్ నుంచి ఏటూరునాగారం గుర్త తెలియన వ్యక్తి దగ్గర నుంచి పేలుడు పదార్థాలు, విప్లవ సాహిత్యం తీసుకొని తిరిగి ఛత్తీస్‌గఢ్ వెళ్లేందుకు ఏటూరునాగారం బాస్టాండ్‌కు రాగా పట్టుకున్నట్టు తెలిపారు. ఆమెపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపుతున్నామని వివరించారు. జయమతిపై ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రూ.8 లక్షల రికార్డు ప్రకటించిందని చెప్పారు. -
మావో హత్యాకాండలో భీమవరం మహిళ!
పశ్చిమగోదావరి, జంగారెడ్డిగూడెం: విశాఖజిల్లా దుంబ్రిగూడ మండలం లిపిట్టిపుట్ట వద్ద మావోయిస్టు హత్యాకాండలో పాల్గొన్న మావోయిస్టులలో భీమవరానికి చెందిన కామేశ్వరి అలియాస్ స్వరూప, అలియాస్ సింద్రి, అలియాస్ చంద్రి, అలియాస్ రింకీ ఉ న్నట్లు పోలీసులు ప్రకటించారు. అయితే ఈమె భీమవరంలో కేవలం కొంతకాలం మాత్రమే ఉన్నట్లు తెలిసింది. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను హతమార్చిన వారిలో ముగ్గురిని గుర్తించినట్లు విశాఖ జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ ప్రకటించారు. వీరిలో తూర్పుగోదావరి జిల్లా దుబ్బపాలెం గ్రామానికి చెందిన జలుమూరి శ్రీనుబాబు అలియాస్ సునీల్, అలియాస్ రైనో, విశాఖ జిల్లా కరకవానిపాలెం గ్రామానికి చెందిన వెంకట రవి చైతన్య అలియాస్ అరుణలతో పాటు జిల్లాలోని భీమవరానికి చెందిన కామేశ్వరి అలియాస్ స్వరూప, అలియాస్ సింద్రి, అలియాస్ చంద్రి, అలియాస్ రింకీ ఉన్నట్లు ఎస్పీ ప్రకటించారు. మావోయిస్టు హత్యాకాండలో అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు గుర్తుపట్టిన వారిలో వీరు ఉన్నట్లు ప్రకటించారు. కామేశ్వరిది శ్రీకాకుళం కాగా, ఈమె తండ్రి ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందినట్లు తెలిసింది. ఈమె తల్లితండ్రులు శ్రీకాకుళంలో ఉండగా, కామేశ్వరిని భీమవరంలో ఒక వ్యక్తికి ఇచ్చి వివాహం చేసినట్లు తె లుస్తోంది. అయితే కొంతకాలం కామేశ్వరి భర్తతో ఉండగా, వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. ఆ తరువాత తూర్పుగోదావరి జిల్లా గోకవరం డిపోలో కామేశ్వరి కండక్టర్‌గా పనిచేసినట్లు సమాచారం. ఆ సమయంలోనే తూర్పుగోదావరి ఏజెన్సీ ప్రాంతానికి విధులు నిమిత్తం వెళ్లడం, అక్కడ మావోయిస్టులు తారసపడటం తదితర ఘటనల నేపథ్యంలో ఈమె మావోయిస్టుల వైపు ఆకర్షితులైనట్లు తెలిసింది. దీంతో 2008–09లో కామేశ్వరి మావోయిస్టుల్లో చేరింది. అప్పటి నుంచి క్రియాశీలక పాత్ర పోషిస్తూ వచ్చింది. మావోయిస్టుల్లో ప్రస్తుతం ఈమె యాక్షన్ టీమ్ సభ్యురాలిగా ఉన్నట్లు సమాచారం. అయితే కామేశ్వరిది భీమవరం అని ప్రకటించడంతో ఒక్కసారిగా జిల్లావాసులు ఉలిక్కిపడ్డారు. ఎవరీ కామేశ్వరి అంటూ అటు పోలీసు వర్గాలు, ప్రజలు చర్చించుకున్నారు. గతంలోనూ జిల్లా నుంచి మావోయిస్టులు ఆంధ్రా ఒడిసా సరిహద్దులో 2016 అక్టోబర్‌లో జరిగిన ఎన్కౌంటర్ అనంతరం ఏఓబీలో వరుస ఎన్కౌంటర్లతో 30 మంది మావోయిస్టులు మృ తిచెందగా, ఒక గ్రేహౌండ్ కానిస్టేబుల్ మృతి చె దారు. మృతిచెందిన మావోయిస్టులో ఇద్దరు జిలê్లవాసులు ఉన్నారు. దేవరపల్లి మండలం పల్లంట్లకు చెందిన దాసు, తాళ్లపూడికి చెందిన దాసు బా వమరిది అయిన కిరణ్ మృతి చెందారు. దీంతో అప్పట్లో జిల్లా పోలీసు యంత్రాంగం ఆశ్చర్యానికి గురైంది. జిల్లాలోని సహజంగా ఏజెన్సీ ప్రాంతాల నుంచి మావోయిస్టుల వైపు గిరిజన యువత ఆకర్షితులవుతుంటారు. అయితే మైదాన ప్రాంతం నుంచి ఆకర్షితులై, ఈ రాష్ట్రంలో కాకుండా ఏఓబీ లో మాయిస్టులలో జిల్లావాసులు ఉండటంతో ఆశ్చర్యానికి గురయ్యారు. తాజాగా భీమవరంలో కొంత కాలం ఉన్న కామేశ్వరి మావోయిస్టుల్లో కీలక పాత్ర పోషించడంతో, అసలు జిల్లా నుంచి మావోయిస్టుల్లో చేరిన వారు ఎంతమంది ఉంటా రనేది పోలీసు యంత్రాంగం అంచనా వేస్తోంది. -
ఎన్కౌంటర్ : మహిళా మావోయిస్టు మృతి
ఒడిశా: ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఒక మహిళా మావోయిస్టు మృతిచెందింది. మిలీషియా రిజర్వు ఫారెస్టులో స్పెషల్ ఆపరేషన్ గ్రూప్(ఎస్ఓజి), మావోయిస్టు మిలిటెంట్ల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. మావోయిస్టులు విచక్షణా రహితంగా కాల్పులు ప్రారంభించారని, ఎస్ఓజీ జవాన్లు తిరిగి కాల్పులు జరపగా ఒక మహిళా మావోయిస్టు మృతిచెందినట్లు ఎస్పీ మిత్రభాను మోహపత్ర తెలిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు గాయపడ్డారన్నారు. మృతురాలిని గుర్తించాల్సి ఉందన్నారు. గాయపడిన జవాన్లు బోంజంగ్ తోమంగ్, విద్యాధర్ సేథ్‌లను బర్హన్పూర్ ఎంకేసీజీ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో ఒక పిస్టల్, మందుగుండు సామగ్రి, పాత్రలు, మందులు కనుగొన్నామని, వాటిని సీజ్ చేసినట్లు, ఆ పరిసర ప్రాంతాల్లో గాలింపు కొనసాగుతోందని ఎస్పీ తెలిపారు. -
మహిళా మావోయిస్టు లొంగుబాటు
భద్రాద్రికొత్తగూడెం: మావోయిస్టు మహిళా సభ్యురాలు పోలీసులు ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు చర్ల ఏరియా దళ సభ్యురాలు సున్నం శ్రీదేవి అలియాస్ నిర్మల శనివారం ఉదయం భద్రాద్రికొత్తగూడెం ఎస్పీ కిశోర్‌ఝా ఎదుట లొంగిపోయారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ జనజీవనస్రవంతిలోకి వచ్చిన మహిళా నక్సలైట్‌ను అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. -
'ఇప్పటికైనా సాక్షి ప్రసారాలను పునరుద్ధరించాలి'
విశాఖ/అలహాబాద్: ఇప్పటికైనా టీడీపీ ప్రభుత్వం సాక్షి ప్రసారాలను పునరుద్ధరించాలని ఏపీ బీజేపీ ప్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. సోమవారం అలహాబాద్ నుంచి మీడియాతో మాట్లాడిన ఆయన సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేతపై స్పందించారు. ఏపీ ప్రభుత్వం ప్రచార సాధనాలను నిలిపివేయడాన్ని ఆయన ఖండించారు. ఏదైనా ఇబ్బంది ఉంటే తగిన ఆధారాలతో చట్టపరంగా పరిష్కరించుకోవాలని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రచార సాధనాలను అడ్డుకోవడమనేది సముచితం కాదని విష్ణుకుమార్ రాజు హితవు పలికారు. కాగా, సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేతను నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పెద్దఎత్తునా నిరసనజ్వాల వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. జర్నలిస్టు సంఘాల నాయకులు, ప్రజాస్వామ్య వాదులు, ప్రజాసంఘాల నేతలు మద్దతు తెలుపుతూ.. పలు జిల్లాలో భారీ ర్యాలీలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. -
మావోయిస్టు పూనం దేవి అరెస్టు
దాదాపు పదమూడేళ్ల క్రితం జిల్లా అటవీ అధికారిని చంపిన కేసులో నిందితురాలైన మహిళా మావోయిస్టును పోలీసులు అరెస్టు చేశారు. ఆమె తలపై 50 వేల రూపాయల రివార్డు ఉంది. పూనం దేవి అనే ఆ మహిళా మావోయిస్టును ఆమె స్వగ్రామమైన తలయ్యా గ్రామంలో అరెస్టు చేసినట్లు బీహార్‌లోని గయ జిల్లా సీనియర్ ఎస్పీ గయా మను మహరాజ్ తెలిపారు. రోహతస్ డీఎఫ్ఓ సంజయ్ సింగ్‌ను 2002లో చంపిన కేసులో ఆమె ప్రధాన నిందితురాలు. ఈ హత్యకేసును సీబీఐ విచారించి, ఆమె తలపై రూ. 50 వేల రివార్డు ప్రకటించింది. ఏరియా కమాండర్ జైకరణ్ యాదవ్ భార్య అయిన పూనందేవి, తర్వాత అతడితో సంబంధాలు తెంచుకుని తలయ్యా గ్రామంలో వేరే వ్యక్తితో కలిసి ఉంటుండగా అక్కడే ఆమెను అరెస్టు చేశారు. -
మహిళా మావోయిస్టు లొంగుబాటు
వరంగల్ : మావోయిస్టు పార్టీ పశ్చిమ బస్తర్ ఏరియా డివిజనల్ కమిటీ సభ్యురాలు నిమ్మల సారమ్మ అలియాస్ జ్యోతి అలియాస్ శారద బుధవారం వరంగల్ ఎస్పీ అంబర్ కిశోర్ ఝా ఎదుట లొంగిపోయింది. వివరాల ప్రకారం... వరంగల్ జిల్లా జనగామ మండలం షామీర్‌పేటకు చెందిన నిమ్మల సారమ్మ తన 12వ ఏటనే మావోయిస్టు పార్టీ సాహిత్యానికి ఆకర్షితురాలై 1990-91లో ఏటూరునాగారం-మహదేవపూర్ ఏరియా కమిటీ దళం సభ్యురాలిగా చేరింది. ఏటూరునాగారం-గుండాల దళ సభ్యురాలిగా కూడా పనిచేసింది. పలు హత్యలు, పేలుళ్ల ఘటనల్లో నిందితురాలైన ఆమె బుధవారం వరంగల్ ఎస్పీ ఎదుట లొంగిపోయింది. పార్టీలో అంతర్గత విభేదాలు, అనారోగ్య సమస్యలే ఆమె లొంగుబాటుకు కారణమని తెలుస్తుంది. కాగా ఆమెపై ఉన్న రూ.5 లక్షల రివార్డును ఆమెకు అందజేయనున్నట్లు ఎస్పీ తెలిపారు. -
మహిళా మావోయిస్టు మృతి
బెల్లంపల్లి, న్యూస్‌లైన్: దండకారణ్యంలో మహిళా విభాగంలో పనిచేస్తూ కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లికి చెందిన గజ్జెల సరోజ ఊరఫ్ అమరక్క(50) అనారోగ్యంతో మృతి చెందారు. గత నెల 11న క్యాన్సర్‌తో అమరక్క అజ్ఞాతంలోనే అకాల మరణం చెందారు. విప్లవ సాంప్రదాయల ప్రకారంగా దండకారణ్యంలో అమరక్కకు మావోయిస్టు అగ్రనేతలు అంత్యక్రియలు నిర్వహించారు. మూడు దశాబ్దాలపాటు సరోజ విప్లవోద్యమంలో పనిచేశారు. ఆదిలాబాద్ జిల్లా నక్సలైట్ ఉద్యమ నిర్మాతల్లో ఒకరైన అన్న అమరుడు గజ్జెల గంగారాం స్ఫూర్తితో ఆమె విప్లవోద్యమంపట్ల ఆకర్షితులయ్యారు. 1980లో ఆమె రహస్య జీవితంలోకి వెళ్లిపోయారు. ఉద్యమంలో పనిచేస్తున్న క్రమంలోనే రాష్ట్ర కార్యదర్శి నల్లా ఆదిరెడ్డి ఊరఫ్ శ్యాం ఆమెను వివాహం చేసుకున్నారు. కొయ్యూరు ఎన్కౌంటర్లో ఆదిరెడ్డి చనిపోయినా ఆమె విప్లవోద్యమంలో కొనసాగారు. అనారోగ్యం బాధిస్తున్నా విప్లవోద్యమంలోనే సరోజ తుదిశ్వాస విడిచారు.