తెలంగాణలో టీడీపీ భూస్థాపితం | tdp is clear in telagana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో టీడీపీ భూస్థాపితం

Published Tue, Feb 16 2016 3:07 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

తెలంగాణలో టీడీపీ భూస్థాపితం - Sakshi

తెలంగాణలో టీడీపీ భూస్థాపితం

 ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి
 
అనుమసముద్రంపేట: ప్రజావ్యతిరేక విధానాల వల్ల టీడీపీ ప్రజాదారణ కోల్పోయిందని, అందుకే తెలంగాణలో ఆ పార్టీ భూస్థాపితమైందని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. ఏపీలో కూడా అదే పరిస్థితులు నెలకొంటున్నాయన్నారు. ఏఎస్‌పేట మండలం చిరమన గ్రామంలో వైఎస్సార్‌సీపీ మండల క న్వీనర్ పందిళ్లపల్లి సుబ్బారెడ్డి, మండల మహిళా కన్వీనర్ బోయిళ్ల పద్మజారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికార పార్టీ నాయకుల బెదిరింపులకు భయపడ వద్దన్నారు. ఈ సారి రాష్ట్రంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావడం ఖాయమని, పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు అధిక ప్రాధాన్యం ఇస్తామని అన్నారు. ఏఎస్‌పేట మండలంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న నాయకులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. జిల్లాలో వైఎస్సార్‌సీపీ బలంగా ఉందని ఈ సారి జిల్లాలో అన్ని స్థానాలు కైవసం చేసుకుంటామని అన్నారు.

 వైఎస్సార్‌సీపీలో 100 మంది చేరిక
 మండలంలోని చిరమన పడమర వీధిలో సోమవారం సుమారు వందమందికి పైగా టీడీపీ, కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి, జెడ్‌పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి సమక్షంలో మండల కన్వీనర్ పందిళ్లపల్లి సుబ్బారెడ్డి, మండల మహిళా కన్వీనర్ బోయిళ్ల పద్మజారెడ్డి, ఆ పార్టీ నాయకుడు బోయిళ్ల చెంచురెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీలో చేరారు.

 కార్యకర్తలకు అండగా ఉంటాం :
 జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి గ్రామ స్థాయిలో ఉన్న వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటామని జెడ్‌పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి అ న్నారు. చిరమన గ్రామంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జన్మభూమి కమిటీలతో ప్రజావ్యతిరేక పాలన సాగుతోందని,అర్హులకు సంక్షే మ పథకాలు అందడం లేద ని అన్నారు. మరో రెండేళ్లు ఓపిక పడితే అందరికీ మంచి రోజులు వస్తాయన్నారు. భవిష్యత్తు వైఎస్సార్‌సీపీదేన్నారు. సమావేశంలో నిర్వాహకులు బోయిళ్ల చెంచురెడ్డి, జెడ్‌పీటీసీ కుదారి హజరత్తమ్మ, జిల్లా ప్రధాన కార్యద ర్శులు అల్లారెడ్డి సతీష్‌రెడ్డి, దేవరపల్లి శ్రీనివాసులురెడ్డి, జిల్లా ఎస్సీ సెల్ నాయకు డు కొం డా వెంకటేశ్వర్లు, మండల నాయకులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement