స్పీకర్ పదవికి మచ్చ తెస్తున్న మధుసూదనాచారి
టీడీఎల్పీ కార్యాలయ తొలగింపు అనైతికం
టీడీపీ జాతీయ కార్యదర్శి రేవూరి ప్రకాశ్‌రెడ్డి
వరంగల్ : రాజ్యాంగ హక్కులను పరిరక్షిస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడే పదవిలో ఉన్న స్పీకర్ మధూసూదనచారి ఆ పదవికి మచ్చ తెస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. హన్మకొండ బాలసముద్రంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్పీకర్ టీడీపీని తెలంగాణ రాష్ట్రంలో ఉంచొద్దనే దురుద్దేశంతోనే టీడీఎల్పీ నేత రేవంత్‌రెడ్డికి సమాచారం ఇవ్వకుండా, ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా అసెంబ్లీలోని టీడీఎల్పీ కార్యాలయూన్ని హౌస్ కమిటీకి కేటారుుంచారని అన్నారు. టీడీపీయే ఆయనకు రాజకీయ జన్మనిచ్చిందనే విషయూన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. టీడీపీని లేకుండా చేయూలన్న సీఎం కేసీఆర్ కుట్రకు స్పీకర్ సహకరిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ నుంచి గెలిచిన 15 మందిలో 10 మంది టీఆర్‌ఎస్‌లో చేరిన సమయంలో అప్పటి టీడీఎల్పీ నేత దయాకర్‌రావు వారిని అనర్హులుగా వేటు వేయాలని ఇచ్చిన లేఖ పెండింగ్‌లో ఉండగా, పార్టీని విలీనం చేస్తున్నట్లు దయాకర్ ఇచ్చిన రెండో లేఖపై నిర్ణయం తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీతక్క, ఈగ మల్లేషం మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న అవినీతి, అక్రమాలపై మా ట్లాడకుండా ప్రతిపక్షాల గొంతునొక్కుతున్న సీఎం కేసీఆర్ నిర్ణయూల అమలుకు స్పీకర్ రాజ్యాంగ విలువలను కాలరాస్తున్నారని అన్నారు.
‘మిషన్’లో అక్రమాలు
మిషన్ కాకతీయలో చెరువులకు ఆయకట్టు లేకున్నా నిధులు కేటాయి స్తూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు అన్నారు. రఘునాథపల్లిలోని చెనిగల చెరువు ఆయకట్టు 15ఎకరాలు లేకున్నా మిషన్‌లో రూ.89.98 లక్షలు కేటాయించారని తెలిపారు. ఈపనుల్లో నాణ్యత పాటించకున్నా పట్టించుకోవడంలేదన్నారు. ఈ పనుల్లో అవినీతిపై చర్చకు చెరువు వద్ద కు నిపుణులతో రావాలంటే టీఆర్‌ఎస్ నేతలు స్పందించలేదన్నారు. ‘మిషన్’ పనులపై కేంద్ర విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌తో విచారణ జరి పించాలని డిమాండ్ చేశారు. జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి పుల్లూరు అశోక్‌కుమార్, గన్నోజు శ్రీనివాసచారి, చాడా రఘునాథరెడ్డి, మార్క విజయ్, జాటోత్ సంతోష్‌కుమార్, బైరపాక ప్రభాకర్ పాల్గొన్నారు.