టీడీపీ నేతల దౌర్జన్యం.. వైద్యుల నిరసన | TDP leaders outrage on doctors | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతల దౌర్జన్యం.. వైద్యుల నిరసన

Published Fri, Apr 22 2016 12:55 PM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

TDP leaders outrage on doctors

అధికార పార్టీ నేతల జులుం పెచ్చుమీరుతోంది. వారి దౌర్జన్యానికి ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది బలవుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో జరిగిన ఘటన వివరాలివీ... అధికార పార్టీకి చెందిన ఎంపీపీ దాసరి రామక్క, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ కో చైర్మన్ బోడా నాగభూషణం తరచూ ఆస్పత్రికి వచ్చి వైద్యులను, సిబ్బందిని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ దుర్భాషలాడుతున్నారు.

 

వారి ధాటికి తాళలేక శుక్రవారం వైద్యులు, సిబ్బంది విధులను బహిష్కరించి, ధర్నాకు దిగారు. ఎంపీపీపై చర్యలు తీసుకోవాలని, కో చైర్మన్‌ను పదవి నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేరేదాకా ప్రతిరోజూ రెండు గంటలపాటు నిరసన తెలుపుతామని వారు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement