పింఛన్ల కోసం టీడీపీ నాయకుల నిరసన
పాములపాడు: పింఛన్ల కోసం టీడీపీ నాయకులు సోమవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. జూటూరు గ్రామ పంచాయతీలో 10వేలపైగా జనాభా ఉండగా..నలుగురికి మాత్రమే పింఛన్లు మంజూరయ్యాయి. దీంతో ఎంపీటీసీ సభ్యురాలు పార్వతమ్మ, టీడీపీ నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి..గ్రామానికి చెంది 60 మందితో ఎంపీడీఓ కార్యాలయం గేటు ఎదుట నిరసన తెలిపారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. వీరికి మాజీ సింగిల్ విండో సొసైటీ అధ్యక్షుడు హరిసర్వోత్తమరావు, రిటైర్డు ప్రిన్సిపాల్ వెంకట్రామయ్యలు సంఘీభావం తెలిపారు. ఇదిలా ఉండగా ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు ఎంపీడీఓ జయరాం విజయ్ తెలిపారు.