సామర్లకోట: సొంత పార్టీకి చెందిన వైస్ ఎంపీపీ, మండల అధికారులు తనను చులకనగా చూస్తున్నారంటూ టీడీపీకి చెందిన ఓ మహిళ ఎంపీపీ ఆవేదన వ్యక్తం చేసింది. మండల సమావేశంలో కంటతడి పెట్టి బయటకు వెళ్లిపోయింది. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో బుధవారం మండల సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. మండల సమావేశంలో ఎంపీపీ కొరత మార్త ప్రసంగించారు. ఈ సందర్భంగా సొంత పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు తనను పట్టించుకోవటం లేదని...దళిత మహిళ అయినందునే అధికారులు చులకనగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటూ ఆమె తీవ్ర మనస్థాపనికి గురై సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయింది.
టీడీపీ మహిళా ఎంపీపీ కంటతడి
Published Wed, Oct 28 2015 1:54 PM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
Advertisement
Advertisement