ఉపాధ్యాయుడు సామాజిక నిర్మాత | teacher is a social builder | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుడు సామాజిక నిర్మాత

Published Thu, Oct 27 2016 12:14 AM | Last Updated on Mon, Sep 4 2017 6:23 PM

teacher is a social builder

కడప ఎడ్యుకేషన్‌: ఉపాధ్యాయుడు సామాజిక నిర్మాత అని ఉపాధ్యాయ వత్తిని ఉద్యోగంగా చేయకూడదని పవన్‌ విద్యాసంస్థల అధినేత లెక్కల జోగిరామిరెడ్డి పేర్కొన్నారు. స్థానిక అక్కాయపల్లెలోని పవన్‌ డీఎడ్‌ కళాశాలలో బుధవారం ద్వితీయ సంవత్సర విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.   ఉపాధ్యాయుడు  సామాజిక వైద్యుడని, సమాజంలోని సమస్యలపై కూడా పోరాడాలన్నారు.  ఉపాధ్యాయులుగా బయటకు వెళ్లిన మీరు సమ సమాజాన్ని నెలకొల్పాలని పిలుపునిచ్చారు. సాయిరాం జూనియర్‌ కళాశాల కరస్పాండెంట్‌ రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ సమాజంలో అవినీతి రహిత సమాజాన్ని నిర్మానించడంలో ఉపాధ్యాయులు కీలక పాత్రను పోషించాలన్నారు. ప్రథమ సంవత్సరంలో ఉత్తమ ్రçపతిభను కనబరిచిన శ్రావణి అనే విద్యార్థికి జోగిరామిరెడ్డి బహుమతిని అందజేశారు.  కళాశాల ప్రిన్సిపల్‌ ,అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement