
అవార్డులు అందుకున్న ఉత్తమ అధ్యాపకులు
ఎస్కేయూ/ జేఎన్‌టీయూ: రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అధ్యాపకులుగా ఎంపికైన జేఎన్‌టీయూ ప్రొఫెసర్ ఈ. కేశవరెడ్డి (మేథమేటిక్స్), ప్రొఫెసర్ దుర్గాప్రసాద్ (మెకానికల్ విభాగం), ఎస్కేయూ ప్రొఫెసర్ దేశాయి సరళాకుమారి (బయో కెమిస్ట్రీ), ప్రొఫెసర్ కే.రాఘవేంద్రరావు ( ఫిజిక్స్)లు సీఎం చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, రాష్ట్ర మానవ వనరుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు అవార్డులు అందజేశారు.