ఫుట్‌బాల్‌ పోటీలకు జిల్లా జట్ల పయనం | teams going to foot ball games | Sakshi
Sakshi News home page

ఫుట్‌బాల్‌ పోటీలకు జిల్లా జట్ల పయనం

Published Thu, Jan 19 2017 10:22 PM | Last Updated on Tue, Sep 5 2017 1:37 AM

ఫుట్‌బాల్‌ పోటీలకు జిల్లా జట్ల పయనం

ఫుట్‌బాల్‌ పోటీలకు జిల్లా జట్ల పయనం

ఏలూరు రూరల్‌ : ఈ నెల 20 నుంచి 22 వరకు శ్రీకాకుళంలో అంతర్‌ జిల్లాల ఫుట్‌బాల్‌ పోటీలు జరగనున్నాయని డీఎస్‌డీవో  ఎస్‌.అజీజ్‌ చెప్పారు. గురువారం ఆయన ఏలూరులో జిల్లా జట్లకు ఎంపికైన ఫుట్‌బాల్‌ క్రీడాకారులకు దుస్తులు  పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 17 ఏళ్లలోపు బాలబాలికలకు జరిగే  పోటీల్లో జిల్లా క్రీడాకారులు పాల్గొని పతకాలు సాధించనున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. 
జిల్లా బాలుర జట్టు 
బి.శ్రీనివాస్, పి.వంశికేశవ, ఎ.సంజయ్‌బాబు, జి.వెంకన్నబాబు, సీహెచ్‌. నిర్మలరాజు, జి.సత్యకృష్ణ, ఎం.అజీజ్‌ అహ్మద్‌ షరీఫ్, ఎండీ చాంద్‌బాషా, ఎ.పండు, ఎం.చంద్రశేఖర్, ఎస్‌కే అజీజ్, సీహెచ్‌వీఎస్‌కే చైతన్య, టి.సతీష్, ఎం.నరసింహ, డి.గణేష్, కె.గాంధీ ఎంపికైనట్టు ప్రకటించారు.
జిల్లా బాలికల జట్టు 
ఎ.లక్ష్మి, ఎ.సత్యవతి, పి.వెంకట నరసమ్మ, బి.శృతి, ఆర్‌.శ్రీదేవి, ఎం.పూజిత శ్రీరమ్య, ఎండీఎస్‌డీ జ్యోతి, యు.ఈశ్వరి, ఎం.పుష్ప శ్రీలయ, కె.ప్రేమ, టి.యువ తేజశ్రీ, డి.రుషిత, ఇ.సరిత ఎంపికయ్యారు. ఇది ఇలా ఉండగా ఇటీవల కడప జిల్లాలో నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్‌–14 వాలీబాల్‌ పోటీల్లో ప్రతిభ చాటిన ముగ్గురు క్రీడాకారులు జిల్లా జట్లకు ఎంపికయ్యారని డీఎస్‌డీవో వివరించారు. బుట్టాయగూడెం నుంచి కె.కార్తీక్, కె.ప్రమీల, ఆచంట నుంచి కె.యశ్వంత్‌గౌడ్‌ రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement