తల్లడిల్లిన ఉల్లి రైతు
కర్నూలు : వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఉల్లికి మార్కెట్లో ధర పడిపోయింది. దీంతో ఎక్కడి సరుకు అక్కడే నిలిచిపోయి.. కనుచూపు మేరా ఉల్లి కనిపిస్తుంది. గిట్టుబాటు ధర లేక రైతులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ముసురు కారణంగా గురువారం వ్యాపారులు కొనుగోలు చేయకపోవడంతో బస్తాల్లోనే మొలకలు వస్తున్నాయి. కుళ్లిపోయిన మూటలు పశువులు తింటున్న దశ్యాలు, కుళ్లిపోయిన ఉల్లిలో నుంచి మంచి గడ్డలు వేరుస్తున్న తల్లీ కొడుకు, వర్షానికి తడిచిపోతున్న మూటలను రిక్షాలో వేరే చోటికి తరలిసున్నారు.